సంక్రాంతి-2025 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహించారు. పిల్లలకు డ్రాయింగ్ ఈవెంట్, పెద్దలకు కబడ్డీ పోటీలు, ఆడవారికి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఇంకా కైట్ ఫెస్టివల్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జపాన్‌లో నివసించే తెలుగువారు, జపనీయులు కూడ పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా గడిపారు. ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా తరువాతి తరం వారికి అందించే విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) నిరంతరం కృషిచేస్తూ ప్రశంసలు అందుకుంటుంది. గత పదేళ్లుగా సంక్రాంతి వేడుకలను జరుపుకుంటూ వస్తున్నామని “తాజ్” నిర్వాహకులు తెలిపారు. ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే కాకుండా, ప్రతీ తెలుగు పండుగను అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకుంటామన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z