* ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా విద్యుత్ కారును (Hyundai Creta EV) విడుదల చేసింది. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 వేదికగా దీన్ని లాంచ్ చేసింది. దీని ధర రూ.17.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్ (ఓ), ప్రీమియం, ఎక్స్‌లెన్స్ వంటి వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. హైఎండ్ ఫీచర్లు కలిగిన కారు ధర రూ.23.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
* ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన యూజర్లను అలర్ట్ చేసింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ 11, అంత కంటే తక్కువ వెర్షన్ మొబైల్స్‌లో యోనో (YONO) సేవల్ని నిలిపి వేయనుంది. ఈ మేరకు పాత వెర్షన్ వాడుతున్న స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపుతోంది. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 లోపు పాత వెర్షన్ ఫోన్లు వాడుతుంటే వారు ఆండ్రాయిడ్ 12 అంత కంటే కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే యోనో సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.
* ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం (IT Company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని (WFH) పూర్తిగా తొలగించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్న టీసీఎస్ అందులోనూ కీలక మార్పులు చేసింది. ఆఫీస్ హాజరు మినహాయింపుల కోసం అభ్యర్థనలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) విధానాన్ని టీసీఎస్ తాజాగా సవరించింది. కార్యాలయ హాజరు అవసరాలను కఠినతరం చేసింది. కంపెనీ తన భారతీయ సిబ్బందికి చేసిన ప్రకటన ప్రకారం.. ఆఫీస్ హాజరు మినహాయింపు కోసం ఉద్యోగులు ఒక త్రైమాసికంలో గరిష్టంగా ఆరు రోజులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులను కారణంగా పేర్కొనవచ్చు. ఒక వేళ ఈ మినహాయింపులను వాడుకోలేకపోయినా తరువాత త్రైమాసికానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ (Zomato) సీఈఓ ‘దీపిందర్ గోయల్’ (Deepinder Goyal) వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గోయల్ ఎందుకు సారీ చెప్పారు? దీనికి కారణం ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. జొమాటో వెజిటేరియన్ ఫుడ్ డెలివీలపై ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ రంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ’ పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ రోజుల్లో భారతదేశంలో శాఖాహారిగా ఉండటం శాపంలా అనిపిస్తుందని లింక్డ్‌ఇన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం మాత్రమే కాకుండా.. ఫీజుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీలో శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదని.. వెజిటేరియన్లను కూడా సమానంగా చూస్తున్నందుకు స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల విజయ పరంపరకు బ్రేక్ వేస్తూ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వారంలో చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 403.24 పాయింట్లు లేదా 0.52 శాతం క్షీణించి 76,639.58 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 77,069.19-76,263.29 రేంజ్‌లో ట్రేడయింది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 23,203.20 వద్ద ముగిసింది. నిఫ్టీ50 23,292.10 వద్ద గరిష్ట స్థాయికి చేరుకోగా, రోజు కనిష్ట స్థాయి 23,100.35 వద్ద నమోదైంది. నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బిపిసిఎల్, హిందాల్కో, హిందాల్కో, కోల్ ఇండియా నేతృత్వంలోని 29 లాభాలతో గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో వంటి 21 షేర్లు నష్టాల్లో ముగిసి 5.75 శాతం వరకు నష్టపోయాయి.
* ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఈ-విటారా (e-Vitara) కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో త్వరలో ఈ-విటారా (e-Vitara)కార్ల ఉత్పత్తి ప్రారంభం కానున్నది. జపాన్, యూరప్‌లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. వచ్చే పదేండ్లలో తాము తయారుచేసే ఈవీ కార్ల వ్యూహంలో భాగం అని, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌క్లూజివ్‌గా ఈ-విటారా కారును ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది. టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జడ్ఎస్ ఈవీ, హ్యుండాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా బీఈ-06 కార్లకు మారుతి సుజుకి ఈ-విటారా గట్టి పోటీ ఇవ్వనున్నది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z