###########
Daily Horoscope
మేషం
కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.
వృషభం
దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. వ్యవసాయరంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.
మిథునం
వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది.
కర్కాటకం
శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి.
సింహం
ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య
ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది.
తుల
ఆర్థికంగా బలపడుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు.
వృశ్చికం
ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం
ధనుస్సు
అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలుఏర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. వ్యాపారరంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు.
మకరం
చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
కుంభం
అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు.
మీనం
మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
###########
Weekly Horoscope
మేషం
పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలం పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి.
వృషభం
సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.
మిథునం
విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అధికారులతో ఉత్సాహంగా ఉంటూ పనులు చేస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులున్నాయి. చెల్లింపుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందులకు హాజరవుతారు. గణపతి ఆరాధన మేలుచేస్తుంది.
సింహం
పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి.
కన్య
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనులలో జాప్యం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
తుల
పిల్లలు చదువులో రాణిస్తారు. పైచదువులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదాపడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రైతులకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రామాలయాన్ని సందర్శించండి.
ధనుస్సు
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భక్తి పెరుగుతుంది. కుటుంబపెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఊహించని ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. గోమాత సేవ చేసుకోండి.
మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులు పూర్తిచేయడంపై శ్రద్ధ చూపుతారు. నరసింహస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
కుంభం
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కళాకారులకు ఆదాయం కలిసి వస్తుంది. శివారాధన శుభప్రదం.
మీనం
ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z