NRI-NRT

ఎన్‌టీఆర్‌కు డల్లాస్‌లో ఘన నివాళి

ఎన్‌టీఆర్‌కు డల్లాస్‌లో ఘన నివాళి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి సందర్భంగా డల్లాస్‌లో ఆయనకు స్థానిక ప్రవాసులు ఘన నివాళి అర్పించారు. లూయిస్‌విల్‌లోని కాకతీయ బ్యాంక్వెట్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ప్రసంగించారు.

పేదలకు పట్టెడన్నం పెట్టడం, మహిళలకు ఆస్తివాటా హక్కు కల్పన, చిత్రరంగంలో విభిన్న పాత్రల ద్వారా నటకౌశలం, రికార్డు కాలంలో తెదేపాను అధికారంలోకి తీసుకురావడం వంటి వాటి ద్వారా ఎన్‌టీఆర్ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు కొనియాడారు. ఏ రంగంలోకి ప్రవేశించినా నిబద్ధతగా నిజాయితీతో పనిచేసిన ఆయన నుండి ఈ తరం క్రమశిక్షణ నేర్చుకోవాలని సూచించారు. డల్లాస్ ఎన్నారై తెదేపా, తెదేపా, ఎన్‌టీఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z