NRI-NRT

NRI BRS UK శ్రేణులతో ఎంపీ వినోద్ భేటీ

NRI BRS UK శ్రేణులతో ఎంపీ వినోద్ భేటీ

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. కేసీఆర్‌ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని.. కేంద్రం ప్రభుత్వంలోని వివిధ సంస్థలు లెక్కలతో సహా మన అభివృద్ధిని అభినందిస్తూ అవార్డులు అందించాయని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే నూతన కార్యవర్గ మొదటి సమావేశాన్ని ఇవాళ జూమ్‌ కాల్‌లో నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ యూకే అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వినోద్‌కుమార్‌, ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో అలాగే తెలంగాణ ఉద్యమానికి ఎల్లప్పుడూ ఎన్‌ఆర్‌ఐలు వెన్నుదన్నుగా నిలబడ్డారని గుర్తుచేశారు. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐ యూకే తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అందుకే వాళ్లు అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్‌ ప్రభుత్వమే అని బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రజా సమస్యలను తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైలంతా వివిధ అంశాలను ప్రజలకు తెలిసేలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందని అనిల్‌ కూర్మాచలం అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. బాధ్యత గల బీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడి సోషల్‌మీడియా వేదికగా, అలాగే లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్‌ను నిలదీయాలని ఎన్‌ఆర్‌ఐ కార్యకర్తలకు సూచించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చే ప్రతి పిలుపునకు స్పందించి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు బీఆర్‌ఎస్‌ ఎన్నారై యూకే అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని అడుగడుగునా ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాటమని చెప్పారు. ముఖ్యంగా సోషల్‌మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీని నిలదీసి, వారి మోసాలను ఎండగడతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సతీశ్‌ రెడ్డి గొట్టిముక్కుల, సత్య మూర్తి చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల & గణేశ్‌ కుప్పాల, కార్యదర్శులు సతీశ్‌ రెడ్డి బండ, సురేశ్‌ గోపతి, అబ్దుల్ జాఫర్, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేశ్‌ ఇస్సంపల్లి, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, సోషల్ మీడియా కన్వీనర్స్ సాయిబాబా కోట్ల, అంజన్ రావు, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్ ముఖ్య సభ్యులు పవన్ గౌడ్, నర్సింగ రావు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z