తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తీన్మార్ సంక్రాంతి’ వేడుకలు టొరంటోలో ఘనంగా నిర్వహించారు. తన్ పూల-ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. TCA అధ్యక్షుడు మన్నెం నివాస్ సభికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ లక్ష్యాలను, ప్రణాళికలను వివరించారు.
2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. రాంబాబు వాసుపిల్లి స్పాన్సర్‌గా వ్యవహరించారు. రుచికరమైన తెలుగు విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు రంజని కందూరి, కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని, పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వరరావు చిత్తలూరి, అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, నివాస తిరునగరి, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం, గుప్తేశ్వరి వాసుపిల్లి, పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ, మాధురి చాతరాజు తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z