NRI-NRT

TCSS సింగపూర్ ఆధ్వర్యంలో రేవంత్‌తో ప్రవాసుల సమావేశం

TCSS సింగపూర్ ఆధ్వర్యంలో రేవంత్‌తో ప్రవాసుల సమావేశం

తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS-సింగపూర్) ఆధ్వర్యంలో శనివారం నాడు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ ప్రవాస తెలుగువారితో సమావేశాన్ని నిర్వహించారు. వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ (GIIS) స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ జయవీర్ కుందూరు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి , డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణ్ కుమార్ రెడ్డి, TCSS వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్ , అధ్యక్షులు గడప రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారుల నృత్యప్రదర్శన, స్వాగత గీతం అలరించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు గడప రమేష్ స్వాగత ప్రసంగంతో తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపన, సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు.

రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ప్రణాళికను, ప్రపంచదేశాలు తెలంగాణను తలయెత్తి చూసే సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రవాస తెలంగాణ ప్రజల నుండి దీనికి సహాయ సహకారాలు ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి శ్రీధర్ బాబు ఐటీ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం అతిథులను సంస్థ కార్యవర్గం సత్కరించింది. కాసర్ల శ్రీనివాస రావు, మిర్యాల సునిత రెడ్డిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 2025 తెలుగు క్యాలెండర్ (సింగపూర్ కాలమాన ప్రకారం) ను విడుదల చేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వేడుక విజయవంతానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, వాసవి పెరుకు, రావుల మేఘన మరియు చల్ల లత సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z