NRI-NRT

డల్లాస్‌లో “శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్” రక్తదాన శిబిరం

డల్లాస్‌లో “శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్” రక్తదాన శిబిరం

శ్రీ ప్రణవపీఠ వ్యవస్థాపకులు, త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ శిష్యులు అమెరికాలోని డల్లాస్‌లో “శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్” (https://vaddipartipadmakar.org/) ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కార్టర్ బ్లడ్ కేర్ సంస్థతో కలిసి శనివారం నాడు ఫ్రిస్కోలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిర నిర్వహణకు సహకరించిన వారికి ఫౌండేషన్ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z