Business

బంగారం ధరలు భగభగ-BusinessNews-Jan 25 2025

బంగారం ధరలు భగభగ-BusinessNews-Jan 25 2025

* క్రెడిట్‌ కార్డుల వినియోగం సర్వసాధారణం అయిపోయింది. వీటిని వినియోగించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అటు బ్యాంక్‌లు సైతం పోటీపడి తమ క్రెడిట్‌కార్డు (Credit card) యూజర్లను పెంచుకుంటున్నాయి. దీంతో గతేడాది డిసెంబర్‌ నెలలో రికార్డు స్థాయిలో కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ అయ్యాయి. ఒక్క నెలలో ఏకంగా 8,20,000 క్రెడిట్‌ కార్డులు జారీ అయినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

* ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు (ICICI bank) త్రైమాసిక ఫలితాల్ని శనివారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ నికర లాభం రూ.11,792 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,272 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ.42,792 కోట్ల నుంచి రూ.48,368 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati Airtel) తాజాగా తీసుకొచ్చిన వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ ప్లాన్లను మరోసారి సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్‌టెల్‌ తన వెబ్‌సైట్‌లో ప్లాన్లను అప్‌డేట్ చేసింది.

* బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ధరలు చూస్తుంటే.. భవిష్యత్తులో బంగారం కొనడం కలగానే మిగిలిపోతుందా అన్న భయం కలుగుతోంది. తాజాగా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కోయంబత్తూర్, జైపూర్ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 83వేలు క్రాస్ చేసి ఆల్ టైమ్ హైకి చేరింది.ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. భాగ్యనగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తులం రూ. 75,550గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు10 గ్రాములు రూ. 8,242గా ఉంది.పొరుగు రాష్ట్రం ఏపీలోనూ ఇవే రేట్లు. విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరలు.. వంద రూపాయలు అటు ఇటుగా హైదరాబాద్ తరహాలో ఉన్నాయి.కిలో వెండి.. లక్షా 5వేలుబంగారానికి తామేం తక్కువ కాదన్నట్లుగా వెండి సైతం.. పసిడి బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి ధర రూ. లక్షా 5వేలుగా ఉంది.

* కరోనా మహమ్మారి తర్వాత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పర్సనల్‌ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. వెసులుబాటు ఉన్నవారు కొత్త కార్లు కొనుగోలు చేస్తే, ఆ అవకాశం లేని వారు యూజ్డ్‌ కార్లు సొంతం చేసుకుంటున్నారు. 2024 యూజ్డ్‌ కార్ల (Used Cars) విక్రయాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్‌ (Maruti Suzuki Swift) మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని మెట్రో పాలిటన్‌ నగరాలు, నాన్‌ మెట్రో నగరాల పరిధిలో అత్యధికంగా ‘స్విఫ్ట్ (Swift)‌’ కారుకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని కార్స్‌24ఎస్‌ ‘గేర్‌ ఆఫ్‌ గ్రోత్‌: 2024 ఇండియన్‌ యూజ్డ్‌ కార్ల మార్కెట్‌ నివేదిక’పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z