* డిజిటల్ చెల్లింపులు విస్తృతమైన నేటి కాలంలో ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి క్రెడిట్ కార్డ్ అనేది శక్తివంతమైన ఆయుధం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చెల్లింపులకు అనువుగా ఉండటమే కాకుండా అనేక రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంది. అయితే ఇదే సమయంలో కార్డ్ చెల్లింపుల కంటే యూపీఐ (UPI) చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. యూపీఐ ద్వారా చెల్లింపులు గతేడాది అక్టోబర్‌లో 2.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 37 శాతం పెరినట్లు ఆర్బీఐ (RBI) తాజా డేటా తెలియజేస్తోంది. ఈనేపథ్యంలో క్రెడిట్ కార్డ్ సౌలభ్యాన్ని, యూపీఐ సేవల సౌకర్యాన్ని మిళితం చూస్తూ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే సర్వీస్ అందుబాటులో ఉంది. దీన్ని ఇప్పటికే కొంత మంది వినియోగిస్తున్నారు.
* ప్రస్తుతం స్టార్‌లింక్ దరఖాస్తును హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. స్టార్‌లింక్ అధికారికంగా దరఖాస్తు పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం ఎలాంటి వివరణ కోరలేదు. ఒకవేళ దీనికి ప్రభుత్వం ఆమోదం లభిస్తే ఈ ఏడాది చివరి నాటికి స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించడం ద్వారా తమ చందాదారులను కోల్పోయే ప్రమాదం ఉందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 వరుసగా రెండవ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 631.55 పాయింట్లు లేదా 0.83 శాతం పురోగమించి రోజు గరిష్ట స్థాయి 76,589.93కి చేరిన తర్వాత 76,532.96 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 205.85 పాయింట్లు లేదా 0.90 శాతం లాభపడి 23,163.10 వద్ద ముగిసింది. ఈ సూచీ బుధవారం 23,181.35 నుంచి 22,976.50 రేంజ్లో ట్రేడయింది. విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 3.32 శాతం పెరగడంతో స్మాల్‌క్యాప్ షేర్లు ఛార్జ్‌లో ముందంజలో ఉన్నాయి. కాగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 2.31 శాతం లాభంతో ముగిసింది.
* దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుముఖంలో ఉన్న పసిడి ధరలు ఉన్నట్టుండి షాకిచ్చాయి. ఇటీవల రోజుల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో నేడు (January 29) బంగారం ధరలు ఎగిశాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవారికి ధరల మోత తప్పని పరిస్థితి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.850 (22 క్యారెట్స్), రూ.920 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 75,950కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,850 వద్దకు ఎగిశాయి.
* దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (Q3 Results)లో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.3,727 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,207 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం రూ.33,513 కోట్ల నుంచి రూ.38,764 కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z