NRI-NRT

ఫ్రిస్కోలో సామాజిక బాధ్యత కార్యక్రమం నిర్వహించిన నాట్స్

ఫ్రిస్కోలో సామాజిక బాధ్యత కార్యక్రమం నిర్వహించిన నాట్స్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఆదివారం నాడు అడాప్ట ఎ స్ట్రీట్ కార్యక్రమంలో భాగంగా టెక్సాస్ రాష్ట్రం ఫ్ర్సికోలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు విద్యార్ధుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. 50 మందికి పైగా స్వచ్చంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, టీల్ & లెగసీ మధ్య రెండు మైళ్ల దూరం ఉన్న ఫీల్డ్స్ పార్క్‌వే వీధిని శుభ్రం చేశారు.

డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రవణ్ నిడిగంటిలు ఈ కార్యక్రమం విజయవంతం చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు నూతి బాపు, బోర్డ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, డల్లాస్ టీం అడ్వైజర్ కవిత దొడ్డ, సహ కోశాధికారి రవి తాండ్ర, మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారె, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, డల్లాస్ చాప్టర్ సభ్యులు బద్రి బియ్యపు, పావని నున్న, కిరణ్ నారె, శివ మాధవ్, వంశీ కృష్ణ వేనాటి, సాయిలక్ష్మి నడిమింటి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

Register for NATS 8th America Telugu Sambaraluhttps://sambaralu.org/

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z