* అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్ గోల్డ్‌లో ఏప్రిల్ డెలివరీ ఔన్స్ బంగారం ధర 17 డాలర్లు తగ్గి 2840.10 డాలర్లకు పడిపోయింది. సోమవారం ఔన్స్ బంగారం ధర 2,872 డాలర్లతో తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకింది. సిల్వర్ కామెక్స్‌లో ఔన్స్ వెండి ధర 0.71 శాతం తగ్గి 32.20 డాలర్ల వద్ద స్థిర పడింది. సరిహద్దుల్లో నిఘా పెంచుతామని మెక్సికో, కెనడా ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా నెల రోజులుగా ఆ దేశాలపై విధించిన టారిఫ్‌లను నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సుంకాల పెంపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు బంగారాన్ని స్వర్గధామంగా పరిగణిస్తున్నారు.
* పాత ఆదాయం పన్ను విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత ఆదాయం పన్నువిధానాన్ని (Old Income tax Regime) రద్దు చేసేందుకు తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళికల్లేవని తేల్చి చెప్పారు. ఇండియాటుడే ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సంగతి తెలిపారు. ఆదాయం పన్ను చెల్లింపుల విధానాన్ని సరళతరం చేయాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనల భారం తగ్గించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
* వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పిన నారాయణ మూర్తి.. మ్యాచ్ చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా అరుదైన దృశ్యం అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు నారాయణ మూర్తిని పిలిచి ఎక్కువ గంటలు పని చేసి ఆదివారం మ్యాచ్ చూడమని సలహా ఇచ్చి ఉంటారని మరొకరు అన్నారు. వారాంతాల్లో ఉద్యోగులు మాత్రమే కాదు.. నారాయణ మూర్తి కూడా పని చేయాలి అని ఇంకొకరు అన్నారు. ఆదివారాల్లో కూడా పనిచేయమని లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు నారాయణ మూర్తి పనిచేయకపోవడం బాధకలిగిస్తోంది.. ఆదివారాల్లో మిమ్మల్ని పని చేయించలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను. ఆదివారాల్లో మిమ్మల్ని పని చేయించగలిగితే, నేను కూడా ఆదివారాల్లో పని చేస్తాను అని ఓ నెటిజన్ అన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.
* ఇండియన్ రైల్వే ‘సూపర్ యాప్’ పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనున్నట్లు గత ఏడాదే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఐఆర్‌సీటీసీ ‘స్వరైల్’ (SwaRail) పేరుతో ఓ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్ వంటి అన్నీ సేవలను పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. రైల్వే సేవలన్నింటినీ.. ఒకే చోట సులభంగా నావిగేట్ చేయగల ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 31, 2025న “స్వరైల్” సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. దీనిని ఆపిల్ యాప్ స్టోర్ & గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు భారీ లాభాలను చవి చూశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203.43 పాయింట్లు లేదా 1.56 శాతం లాభంతో 78,390.17 వద్ద, నిఫ్టీ 373.80 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో.. 23,734.85 వద్ద నిలిచాయి. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి. గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (ఫిబ్రవరి 4)న శుభారంభం పలికాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే.. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
* టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీసీపీఎస్ఎల్)ను భారత్‌లోని ఆస్ట్రేలియాకు చెందిన ఫిన్‌టెక్ కంపెనీకి విక్రయించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫైండీ ఆధ్వర్యంలోని భారతీయ అనుబంధ సంస్థ ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ (టీఎస్ఐ)కు టీసీపీఎస్ఎల్‌ను విక్రయించే ప్రణాళికలను ఆర్‌బీఐ ముందుంచారు. దాంతో తాజాగా వాటిపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.330 కోట్ల విలువైన ఈ డీల్ వల్ల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆర్థిక సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నవంబర్ 2024లో ప్రకటించిన ఈ కొనుగోలు టీసీపీఎస్‌ఎల్ వైట్ లేబుల్ ఏటీఎం(నాన్ బ్యాంకింగ్ నిర్వహకులు ద్వారా నడిచే ఏటీఎం) ప్లాట్‌ఫామ్, ఇండికాష్ ఏటీఎంల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి ఫైండీకి వీలు కల్పిస్తుంది. టీఎస్‌ఐ ప్రస్తుతం 7,500కు పైగా బ్రౌన్ లేబుల్ ఏటీఎం (స్పాన్సర్ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు)లను నిర్వహిస్తుంది. 10,000 కంటే ఎక్కువ వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కొనుగోలుతో ఫైండీ 4,600 ఆపరేషనల్ ఇండికాష్ ఏటీఎంలను తీసుకుంటుంది. మరో 3,000 ఏటీఎం పొందేందుకు ఫైండీకి అవకాశం లభిస్తుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z