కాన్సాస్ సిటీ తెలుగు సంఘం (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో సంక్రాంతి సంబరాలను 19వ తేదీన ఘనంగా నిర్వహించారు. ముగ్గుల, చదరంగం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. తెలుగు సంఘం అధ్యక్షురాలు శ్రావణి మేక అతిథులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మధు బిందు తుమ్మల, నందిని పచ్చ్చళ్ల, అను ఆర్నిపల్లి, ట్రస్ట్ ఛైర్ శ్రీని పెనుగొండ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z