ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో అర్వింగ్‌లో ఆదివారం నాడు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అధ్యక్షుడు చంద్రశేఖర్ పొట్టిపాటి అతిథులను ఆహ్వానించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ లక్ష్యాలను వివరించారు. సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. యువతకు పెద్దపీట వేసే కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులు ఆస్వాదించారు. రిషిత్ విఠల్ గద్దె భక్తిగీతాలాపన, చరణ్-భాను పావులూరిలు అమెరికా జాతీయ గీతాలాపన, మన్వితా రెడ్డి బృందం “మూషిక వాహన”, చంద్రిక అద్దంకి బృందం “పల్లె పండుగ”, సింధూజ ఘట్టమనేని బృందం “ధ్యానశ్లోకం బృంద”, హర్షిత మారుబోయిన బృందం “గర్ల్స్ ఆఫ్ గెలాక్సీ”, వినీల చిట్లూరు బృందం “బ్యూటిఫుల్ బటర్ ఫ్లయ్స్”, రాజేశ్వరి అన్నం బృందం “గోవిందాశ్రిత గోకుల బృంద”, శోభా ప్రత్తి బృందం “తెలుగింటి నక్షత్రాలు”, జై షీలా శెట్టి బృందం “జయ జనార్దనా కృష్ణా”, పద్మా శొంఠి బృందం “గణపతి భజన”, ఉషా మాసారపు “మిర్చి డ్యాన్సు”, శ్రీదేవి యడ్లపాటి బృందం “కొండలలో నెలకొన్న”, శోభా తీగల బృందం “సంక్రాంతికి వస్తున్నాము”, సుజావంతి శ్రీనివాసన్ బృందం “కృష్ణ లీల”, శాంతి నూతి బృందం “బాలయ్య 50 వసంతాల వేడుకలు”, స్వప్నశ్రీ చకోటి బృందం “గొల్లభామలు -కృష్ణ”, కల్యాణి ఆవుల బృందం “కొయిలారే”, హర్షద మాశెట్టి బృందం “క్వీన్ స్ యు నైట్” పేరిట చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి.
మాజీ అధ్యక్షుడు సతీష్ బండారు తనకు సహకరించిన పూర్వ కార్యవర్గానికి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2025 పాలకమండలి అధిపతి డాక్టర్ తిరుమలరెడ్డి కొండా, ఉపాధిపతి దయాకర్ మాడా, పాలకమండలి మాజీ సభ్యులు సురేష్ మండువ, హరి సింగం, తదుపరి అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, తదుపరి ఉపాధ్యక్షుడు ఉదయకిరణ్ నిడిగంటి, కల్చరల్ చెయిర్ దీపికా రెడ్డి, కొరియోగ్రాఫర్లు కరుణాకర్ గద్దె, భాను పావులూరి, వ్యాఖ్యాతలు వీణ యలమంచిలి-శ్రీనివాస్ ప్రసాద్, వేడుకల సమన్వయకర్త దీప్తి సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు. సాయి తరంగ్ వందేమాతరం-శ్రేయలక్ష్మి కోడెల సంగీత విభావరి ఆకట్టుకుంది. అతిథులకు షడ్రుచోపేత తెలుగు భోజనాన్ని అందజేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z