తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో(TACO) 2025 సంక్రాంతి సంబరాలను ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలు రోజంతా అతిథులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలతో సాగాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వారం రోజులుగా కొలంబస్‌లో ఉండి స్థానికులకు శిక్షణ ఇచ్చి సంక్రాంతి వేడుకల్లో ప్రదర్శన చేసి ఆహుతులను అలరించారు.
స్థానిక ప్రవాసులతో టాకో బిగ్ బాస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అతిధిగా నీరజ్ అంతాని హాజరయి సభికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టాకో అధ్యక్షుడు కాళీ ప్రసాద్ రాజు మావులేటి, చంద్ర రాయల, భాస్కర రుద్రరాజు, హారిక బల్లెకారి, నీలిమ ఎలమంచిలి, సుప్రియ, వర్ష, హారిక సి, విషు, ప్రదీప్, రామ్ గద్దె, రాజేష్ చెరుకూరి, రాజ్ వంటిపల్లి, సంపత్, స్వామి, రాఘవ్, మాధురి, భరత్, రాజు, సాకేత్, మహేష్, మనోజ్, శ్రీహరి, సంజయ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z