Movies

సోషల్ మీడియా…ఓ పెద్ద మనోవేదన

సోషల్ మీడియా…ఓ పెద్ద మనోవేదన

‘‘సామాజిక మాధ్యమాలు లేని రోజుల్లో ఎవరు ఎక్కడికి పోతున్నారు.. ఎవరితో పోతున్నారో మనకు తెలిసేది కాదు. జీవితం సింపుల్‌గా ఉండేది. ఇపుడు ఫోను చేతిలో ఉండి, ఎవరినైనా ఫాలో చేస్తూ ఉంటే చాలు. మొత్తం సమాచారం మీకు వచ్చేస్తుంది. ఆమె ఎక్కడికి పోతోంది.. ఎవరిని కలుసుకుంటోంది.. ఈ పోస్టు వచ్చింది.. ఆ పోస్టు వచ్చింది.. ఇలా ఆన్‌లైనులో అంతులేని స్క్రోలింగు నడుస్తుంది. ఇదంతా పెద్ద మనోవేదన’’ అని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (59) అన్నారు. తన సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ కుమారుడైన అర్హాన్‌ఖాన్, అతడి మిత్రబృందంతో కలిసి ‘‘డంబ్‌ బిర్యానీ’’ పాడ్‌కాస్ట్‌ ముందు కూర్చొన్న సల్మాన్‌ మనసు విప్పి మాట్లాడారు. అర్హాన్‌కు చెందిన ఈ యూట్యూబ్‌ ఛానల్‌కు ఫేస్‌బుక్, ‘ఎక్స్‌’, ఇన్‌స్టాగ్రాంలలో 16 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. గడిచిపోయిన విషయాలు (బ్యాగేజీ) మోస్తూ బతకొద్దని, వర్తమానంలో జీవించాలంటూ సల్మాన్‌ యువతకు సూచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z