* గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్‌ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో బ్లూచిప్ కంపెనీల్లో ఆరు కార్పొరేట్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,18,151.75 కోట్లు పెరిగింది. వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ భారీగా లబ్ధి పొందాయి. గత వారం బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 354.23 పాయింట్లు (0.45శాతం), ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 77.8 పాయింట్లు (0.33 శాతం పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా లబ్ధి పొందాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ నష్టాలతో ముగిశాయి. టీసీఎస్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, ఐటీసీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.15 లక్షల కోట్లు కోల్పోయాయి. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 32,639.98 కోట్ల వృద్ధితో రూ.13,25,090.58 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.31,003.44 కోట్లు పుంజుకుని రూ.9,56,205.34 కోట్ల వద్ద నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.29,032.08 కోట్లు పెరిగి రూ.5,24,312.82 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,114.32 కోట్ల వృద్ధితో రూ.7,90,074.08 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.2,977.12 కోట్లు పెరిగి రూ.17,14,348.66 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1,384.81 కోట్లు పుంజుకుని రూ.8,87,632.56 కోట్ల వద్ద ముగిసింది.
* ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం ఎంతుందో మనందరికి తెలుసు. ఈ రంగం,ఆ రంగం అని లేదు.. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది. అతి తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే AI ని ఎక్కువగా వినియోగిస్తున్నది మనమేనట.. ఇది ఇటీవల జరిగిన సర్వేలు చెబుతున్నాయి. 025 గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్స్ స్టడీ అనే పేరుతో ఎమొరిటస్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం AI వినియోగంపై సంచలన విషయాలు తెలిశాయి. భారతీయుల కెరీర్ ను AI మారుస్తోందని.. 94శాతం మంది భారతీయ నిపుణులు AI వాడుతున్నారని.. వారి కెరీర్ పురోగతికి కీలకమని నమ్ముతున్నారని వెల్లడించింది. 18దేశాల్లో 6వేల మందికి పైగా నిపుణులను సర్వే జరిగింది. ఈ సర్వేల్లో AI వాడకంలో భారత్ ముందుందని, 1700 మంది భారతీయులలో 96శాతం మంది AI సాధనాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.ఇది US (81%) ,UK (84%) కంటే చాలా ఎక్కువ. ఏఐ వాడకంలో 95శాతం మంది భారతీయ కార్మికులు ఉత్పాదకత పెరిగింది. ఇది ప్రపంచ సగటును అధిగమించిందని నివేదించారు.
* వాట్సాప్పేలో డిజిటల్ పేమెంట్స్ చేయడం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత అప్డేట్ అయింది. అదేంటంటే.. వాట్సాప్పేలో బిల్పేమెంట్స్ అనే కొత్త ఫీచర్ఇండియాలో తీసుకురాబోతున్నారని మెటా కంపెనీ తెలిపింది. ఇది అచ్చం యూపీఐ లానే పనిచేస్తుందట. ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్‌బీటా వెర్షన్ 2.25.3.15లో ఈ ఫీచర్ ఉంది. ప్రస్తుతం వాట్సాప్యూజర్లు వాళ్ల కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లకు మనీ సెండ్చేయగలుగుతున్నాం. అయితే బిల్ పేమెంట్స్ఫీచర్ వచ్చాక, ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ ప్రీ–పెయిడ్రీచార్జ్లు, ఎల్పీజీ గ్యాస్ పేమెంట్స్, వాటర్ బిల్, లాండ్ లైన్ పోస్ట్ పెయిడ్ బిల్, రెంట్ వంటివి ఈజీగా కట్టొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజీలో ఉంది. ఈ ఫీచర్గాని అందుబాటులోకి వస్తే ఫోన్‌పే, గూగుల్ పే యాప్స్‌కు గట్టిపోటీ ఇస్తుందట!
* రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇచ్చి, కోర్సులు నిర్వహించి ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించిన అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్, యూట్యూబర్ అస్మిత పటేల్, మరో నలుగురిపై సెబీ చర్యలు తీసుకుంది. మార్కెట్‌లో పాల్గొనకుండా వీరిపై నిషేధం పెట్టింది. వీరు కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్ల నుంచి సేకరించిన రూ.53 కోట్లను సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది. అస్మిత పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అస్మిత జితేష్ పటేల్, జితేష్ జెతలాల్ పటేల్, కింగ్ ట్రేడర్స్, జెమిని ఎంటర్‌ప్రైజ్, యూనైటెడ్ ఎంటర్‌ప్రైజ్‌కు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరో రూ.104.63 కోట్లను ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని ఆదేశించింది. యూట్యూబర్, ఫిన్‌ఫ్లూయెన్సర్ అస్మిత పటేల్ తనకు తాను ‘షీ వోల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్’, ‘ఆప్షన్స్ క్వీన్’ గా ప్రచారం చేసుకుంటోంది. సుమారు లక్ష మంది స్టూడెంట్లు, ఇన్వెస్టర్లు, పార్టిసిపెంట్లకు ఆమె ట్రేడ్ సలహాలు ఇచ్చారని అంచనా.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z