మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులను ఆదుకునే స్థాయిలో ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం బాగా వృద్ధి చెందుతాయి. కొత్త పరిచ యాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. సకాలంలో బాధ్యతలు, లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. తలపెట్టిన వ్యవహారాలన్నీ కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా సఫలం అవుతాయి. నిరుద్యో గులు తమ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆర్థికంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధించ డానికి అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. పిల్లలు వృద్దిలోకి వస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సాను కూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మితిమీరిన ఔదా ర్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సొంత పనుల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిం చుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో ఒకటి రెండు సమ స్యలు పరిష్కారం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశ ముంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలక డగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగాఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. ఆకస్మిక ధన లాభా నికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సకాలంలో సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక సంబంధమైన కొన్ని సమస్యల నుంచి బయట పడ తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజ యవంతంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొద్దిగా ఆదాయ వృద్దికి అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యాలు తప్పకుండా సఫలం అవు తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసు కుంటారు. ఆర్థికపరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపు తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రస్తుతానికి ఎవరికైనా వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. దాంపత్యంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత ఉంటుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఆస్తి వివాదానికి సంబంధించి సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం చేతికి అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి ఒక సానుకూలమైన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరు ద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం జరుగుతుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z