* సైబర్ కేటుగాళ్లు రెచ్చపోతున్నారు. పెద్ద పెద్ద సంస్థలకే కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏకంగా దేశంలోనే ప్రముఖ నిర్మా ణ సంస్థ అయిన మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)ను బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. ఇ మెయిల్ చిరునామాలోని ఒక అక్షరాన్ని మార్చి రూ. 5.47 కోట్లు(సుమారు 6.6 మిలియన్లు) స్వాహా చేశారు. హైదరాబాద్ బాలానగర్ లోని సంస్థ ఎకౌంట్స్ మేనేజర్ దుంపల శ్రీహరి తెలంగాణ సైబర్ క్రైం బ్రాంచ్ కి ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
* ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ హాట్‌స్టార్, జియో సినిమా కలిసి జియోహాట్ స్టార్యాప్ను లాంచ్చేశాయి. రిలయన్స్‌కు చెందిన వయాకామ్, స్టార్ఇండియా విలీనం ఫలితంగా ఇవి రెండూ కలిశాయి. వీటి దగ్గర మూడు లక్షల గంటలకుపైగా కంటెంట్, 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారని అంచనా. సబ్స్క్రిప్షన్ధరలు రూ.149 నుంచి రూ1,499 వరకు ఉంటాయి. జియో సినిమా, హాట్‌స్టార్ యాప్‌ల సబ్స్క్రయిబర్లు ఆటోమేటిక్‌గా కొత్త యాప్‌కు మారుతారు. ఐసీసీ, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ వంటి స్పోర్ట్స్ఈవెంట్లు ఈ యూప్ ద్వారా చూడవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలంటే కనీసం రూ.149 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాలి.
* బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త..బంగారం ధరలు తగ్గాయి..నిన్నటి ధరలతో పోల్చితే వెయ్యి రూపాయలు తగ్గాయి. శనివారం (ఫిబ్రవరి15) 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1000 లు తగ్గి రూ. 78,910లు ఉంది. అదే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1090 లు తగ్గి రూ. 86.070 వద్ద ట్రేడ్ అవుతోంది. శనివారం బంగార ధరలు తగ్గుదల మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ లో కొంత ఊరటనిచ్చింది.. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.. జనవరి నెలలో 8శాతం బంగారం ధరలు పెరిగాయి.
* సైబర్ క్రైం నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎవర్నీ వదలడం లేదు. రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, సామాన్యులు,చిన్నాచితక ఉద్యోగుల్ని సైతం వదలకుండా దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ లు,ఫోన్లకు లింక్ లు పంపి.. ఏసీబీ, సీబీఐ అంటూ దోచేస్తున్నారు. లేటెస్ట్ గా తహసీల్దార్ నే బురిడీ కొట్టించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఏసీబీ అధికారులమంటూ 3లక్షలు దోచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట తహశీల్దార్ దామోదర్ కు ఏసీబీ అధికారిని అంటూ ఓ ఫోన్ వచ్చింది. మీరు ఆన్ లైన్ మోసాలకు , అవినీతికి పాల్పడుతున్నారని డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదని బెదిరింపు కాల్స్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్..ఆ కేటుగాళ్ల అకౌంట్ కు ఆన్‌లైన్‌లో రూ.3.30లక్షలు పంపించారు. తీరా నకిలీ అధికారులని గమనించి.. మోసపోయానని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు తహసీల్దార్ దామోదర్. కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ే 1930కి కాల్ చేయాలని చూస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z