NRI-NRT

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సెయింట్ లూయిస్ మహాత్మ గాంధీ సెంటర్‌లో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. నాట్స్ సలహా మండలి సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. స్థానిక ప్రవాసులు ఈ శిబిరాన్ని విజయవంతంగా వినియోగించుకున్నారు. నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, బోర్డ్ డైరెక్టర్ రమేశ్ బెల్లం, మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, స్థానిక ప్రతినిధులు నాగ శ్రీనివాస్ శిష్ట్ల, మధుసూదన్ దడ్డ తదితరులు పాల్గొన్నారు. నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులను చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు అభినందించారు.

NATS 8th America Telugu Sambaralu On July 4th – https://sambaralu.org/

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z