NRI-NRT

అట్లాంటాలో శంకర నేత్రాలయ సమావేశం

అట్లాంటాలో శంకర నేత్రాలయ సమావేశం

శంకర నేత్రాలయ అమెరికా (SN USA) అట్లాంటాలో మీట్ & గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కొత్త మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU)ను స్థాపించడానికి ప్రసాదరెడ్డి-శోభారెడ్డి కాటంరెడ్డి దంపతులు $500,000 విరాళం ఇవ్వడంతో పాటు 11 గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఆర్థిక చేయూతను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనకు ధన్యవాదాలు తెలిపి గౌరవించారు. శంకర నేత్రాలయ అమెరికా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రసాదరెడ్డిని ఈ సందర్భంగా నియమించారు. ప్రతి MESUలో రెండు బస్సులు ఉంటాయి. ఈ బస్సులు మారుమూల గ్రామాలకు వెళ్లి క్షేత్రంలోనే శస్త్రచికిత్సలు చేస్తాయి. ఒక బస్సును సన్నాహక యూనిట్‌గా మరియు మరొక బస్సును ఆపరేటింగ్ థియేటర్‌గా ఉపయోగిస్తారు. స్థానిక ప్రవాస యువతీయువకుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

గత 15 సంవత్సరాలుగా రెండు MESU బృందాలు ఇండియాలో సేవలందిస్తున్నాయి. చెన్నైలో 2011 నుండి ఒకటి, టాటా ట్రస్ట్ సహాయంతో 2వ MESU 2016 నుండి జార్ఖండ్‌లో సేవలందిస్తోంది. హైదరాబాద్‌లో 3వ MESUను 2024లో ప్రారంభించారు. 4వ యూనిట్ మార్చి 2025లో పుట్టపర్తిలో ప్రారంభమవుతుంది.

SN USA వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు ఎమెరిటస్ SV ఆచార్య, SN-USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి, కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని వంగిమళ్ల, మెహర్ చంద్ లంక, రాజ్ ఐల, శ్రీధర్ జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, డాక్టర్ మాధురి నముదూరి, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ రమేష్ చాపరాల, ఎంఈఎస్‌యూ కమిటీ స్థాపన చైర్‌ డాక్టర్‌ కిషోర్‌రెడ్డి రసమల్లు, అట్లాంటా చాప్టర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ తద్దర్‌, పద్మజ కేలం, యూత్ కమిటీ సభ్యులు అంష్ గడ్డమణుగు, చరిత్ర జూలపల్లి, BOT డా.యు.నరసింహారెడ్డి, ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, శ్రీనివాస్ దుర్గం, సందీప్ కౌతా, దుర్గా గోరా, శ్రీవల్లి శ్రీధర్, శిల్పా ఉప్పులూరి, ఉషా మోచెర్ల, జనార్ధన్ పన్నెల, ఉపేంద్ర రాచుపల్లి, సురేష్ వేములమడ, రాజేష్ తడికమల్ల, శాంతి మేడిచెర్ల, EVP శ్యామ్ అప్పాలి, కార్యదర్శి వంశీ ఎరువరం, త్యాగరాజన్, దీన దయాలన్‌, డాక్టర్ వీణా భట్, శేఖర్ రెడ్డి, డాక్టర్ పాల్ లోపెజ్, మురళీ రెడ్డి, బిందు వేమిరెడ్డి, వించెల్ జాఫర్స్, ఆంటోనీ థాలియత్, రవి పోణంగి, బాబ్ ఎర్రమిల్లి, నారాయణ, బాబ్ ఎర్రమిల్లి, నారాయణ రామకృష్ణన్, రవి కందిమళ్ల, బలరాంరెడ్డి, విజు చిలువేరు, కోదండ దేవరపల్లి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, ఆది చిన్నతిమ్మ, కృష్ణ ఏవూరు, రాజ్ వుచాటు, శ్రీకాంత్ గొంగాలరెడ్డి, కృష్ణ ఏవూరు, శశికళ పెనుమర్తి, రవి పెనుమర్తి, జస్సోత బాలసుబ్రహ్మణ్యం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, జయచంద్రారెడ్డి, మంజుల మల్లా రెడ్డి, భక్తవత్సలరెడ్డి, సుబ్బారావు వుదాతు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z