* మఖానా (Makhana) సూపర్ ఫుడ్ అని, అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. 365 రోజుల్లో 300 రోజులు అది తన ఆహారంలో భాగమయ్యేలా చూసుకుంటానని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలకు అల్పాహారంలో మఖానా ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని పేర్కొన్నారు. సోమవారం బిహార్‌లోని భాగల్‌పుర్‌లో పర్యటించిన సందర్భంగా.. తన ఆహారపు అలవాటు గురించి చెప్పారు.
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy)లో కనిపిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు మూడో స్థానమని తేల్చేశాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పోయేదేమీ లేదంటున్నారని.. అలాంటి ఢోకా లేకుంటే ప్రచారానికి ఎందుకొచ్చినట్లని ప్రశ్నించారు. ‘‘కేసులపై మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? భారాసతో చీకటి ఒప్పందాలు చేసుకుని మాపై బురద చల్లుతారా?గత ప్రభుత్వ స్కామ్‌లు సీబీఐకి అప్పగిస్తే దోషులను జైల్లో వేస్తాం’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
* ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తునిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సోమవారం పలువురు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెదేపాలో చేరిన వారిలో రూపాదేవి, శ్రీను, ప్రభావతి, వెంకటరమణ, నాగలక్ష్మి, సుభద్రాదేవి ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు 15 మంది కౌన్సిలర్లు తెదేపాలో చేరినట్లయింది.
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు ఎవరి ఓటు వేయాలో భారాస అధినేత కేసీఆర్ (KCR) చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. ఎవరి గెలుపుకోసం కేసీఆర్ కుటుంబం పనిచేస్తుందో చెప్పాలన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడారు.
* కాంగ్రెస్(Congress), ఆప్(AAP) నేతల మధ్య పరస్పర ఆరోపణలు పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి చెందిన 32మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్‌లో ఉన్నట్లు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ఆప్ ఎమ్మెల్యేలు భాజపాతో కూడా టచ్‌లో ఉండే అవకాశం ఉందని ఆరోపించారు.
* జనాలు ఛీకొడుతున్నా వైకాపా అధ్యక్షుడు జగన్ (YS Jagan) తీరు మారడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. నేడు అసెంబ్లీకి వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా? అని నిలదీశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆమె పోస్ట్ చేశారు.
* రష్యాపై యుద్ధం చేసేందుకు తమకు అమెరికా అందించిన సాయం 100 బిలియన్ డాలర్లే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటి వరకు 320 బిలియన్ డాలర్లు ఖర్చుకాగా.. ఇందులో 120 బిలియన్ల డాలర్లను ప్రజల నుంచి సేకరించామని.. మరో 200 బిలియన్ డాలర్లను ఐరోపా సమాఖ్య, అమెరికా అందించాయని జెలెన్‌స్కీ కీవ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ‘‘మొత్తంగా అమెరికా నుంచి 67 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలు.. 31.5 బిలియన్ డాలర్ల బడ్జెట్ సపోర్ట్ మాత్రమే అందాయి. ఎవరైనా సరే దానిని 500 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి అంతమొత్తం ఖనిజ సంపద ఇవ్వమని అడగకూడదు’’ అని పేర్కొన్నారని కీవ్ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
* చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ (Pakistan) ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. పలు దేశాల ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు (Terrorists) భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్ పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. విదేశీ అతిథులను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్ -ఈ తాలిబాన్ పాకిస్తాన్ (TTP), ఐఎస్ఐఎస్(ISIS), బలూచిస్తాన్ కు చెందిన పలు ఉగ్రవాద గ్రూపులు భారీ కుట్ర వేస్తున్నట్టు పాక్ ఇంటెలిజెన్స్ అనుమానిస్తున్నట్టు సమాచారం. విదేశీ అతిథులను కిడ్నాప్ చేయాలనే లక్ష్యంతో పలు ఉగ్ర గ్రూపులు పథకాలు రచిస్తున్నాయట. ఈ క్రమంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలకు సందేశం పంపినట్టు సమాచారం. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు ఈ కుట్రకు తెరతీశాయని, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
* మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్‌కు కావాల్సింది ప్రతిపక్ష హోదానే కాని ప్రజా సమస్యలు మాత్రం ఆయనకు పట్టవని విమర్శించారు. శాసనసభ సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈరోజు జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తుచేశారు.
* మహా కుంభమేళా(Maha Kumbh) మరో రెండు రోజుల్లో ముగియనుండగా విమర్శకులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఏకంగా యూపీ అసెంబ్లీ (UP Assembly) నే వేదికగా చేసుకున్నారు. కుంభమేళా నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించడం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ చీఫ్ మమతాబెనర్జి, ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ విమర్శలు చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో సీఎం యోగీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఆగ్రహం వెళ్లగక్కారు.
* ఈ నెల 27వ తేదీన ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బోనకల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి, ఎమ్మెల్సీ రూట్ ఆఫీసర్ కడారు విజయ భాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీ పోలింగ్ రోజున ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్‌ను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలింగ్ సజావుగా జరిగేలా పరివేక్షించాలన్నారు. ఆయన వెంట తహసిల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఆర్ ఐ గుగులోత్ లక్ష్మణ్ ఉన్నారు.
* రష్యాపై యుద్ధం చేసేందుకు తమకు అమెరికా అందించిన సాయం 100 బిలియన్ డాలర్లే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటి వరకు 320 బిలియన్ డాలర్లు ఖర్చుకాగా.. ఇందులో 120 బిలియన్ల డాలర్లను ప్రజల నుంచి సేకరించామని.. మరో 200 బిలియన్ డాలర్లను ఐరోపా సమాఖ్య, అమెరికా అందించాయని జెలెన్‌స్కీ కీవ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ‘‘మొత్తంగా అమెరికా నుంచి 67 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలు.. 31.5 బిలియన్ డాలర్ల బడ్జెట్ సపోర్ట్ మాత్రమే అందాయి. ఎవరైనా సరే దానిని 500 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి అంతమొత్తం ఖనిజ సంపద ఇవ్వమని అడగకూడదు’’ అని పేర్కొన్నారని కీవ్ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
* సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)
నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది? ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z