* పొద్దున లేవగానే గొంతులో వేడి వేడిగా ఛాయ్ లేదా కాఫీ తాగటం చాలా ఇళ్లల్లో కనిపించేదే. రోజులో పని మధ్యలో రిలాక్సేషన్ కోసం తాగేవారు ఎక్కువే. కానీ షుగర్ ఉన్నవారైనా లేనివారైనా ఈ అలవాటును కొనసాగిస్తే ఆరోగ్యానికి మరింత ప్రమాదం. అందుకే చక్కెరతో చేసిన టీ లేదా కాఫీలకు బదులుగా బెల్లం టీని తాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రజల ఆలోచనను గమనించిన కెవిన్ జోర్డాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ చౌరస్తాలో తొలిసారి బెల్లం టీ వ్యాపారం మొదలుపెట్టి దూసుకుపోతున్నాడు. యాలకుల చాయ్, బ్లాక్ చాయ్, అల్లం చాయ్, చాక్లెట్ చాయ్ ఇలా రకరకాల ఫ్లేవర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. ఒక కప్పు టీని రూ.10లకు విక్రయిస్తూనే కెవిన్ రోజుకు రూ.15వేలు సంపాదిస్తున్నాడు. దీన్ని బట్టే ఈ వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
* దేశీ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదు కావొచ్చని, దాంతో బాండ్ల మీద రిటర్న్స్ పెరిగి విదేశీ మదుపర్లు భారత్ వంటి దేశాల నుంచి నిధులను మరింతగా ఉపసంహరించుకుంటారని ప్రముఖ బ్రోకరేజి సంస్థ నోమురా అంచనా వేసింది. ఈ విశ్లేషణలు, రూపాయి పతనం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ సూచీలను నష్టాల నుంచి కోలుకోనివ్వడం లేదు. సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
* గత శుక్రవారం ముగింపు (75, 311)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చాలా రోజుల తర్వాత 75 వేల దిగువకు పడిపోయింది. చివరి దశలో ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో దాదాపు వెయ్యి పాయింట్లు కోల్పోయి 74, 387 దగ్గర సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 856 పాయింట్ల భారీ నష్టంతో 74, 454 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 242 పాయింట్ల భారీ నష్టంతో 22, 553 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో వరుణ్ బేవరేజెస్, అబాట్ ఇండియా, లారస్ ల్యాబ్స్, బాటా ఇండియా షేర్లు లాభాలను ఆర్జించాయి. నేషనల్ అల్యూమినియం, ఇన్ఫో ఎడ్జ్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్473 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.69గా ఉంది.
* క్రికెట్ అభిమానులు, మూవీ లవర్స్ కోసం జియో ఒక సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. జియో ప్రీపెయిడ్ కస్టమర్లు 195 రూపాయల డేటా ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే 15 జీజీ హై స్పీడ్ డేటాతో పాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్ సీజన్ 18 మ్యాచులతో పాటు హాట్ స్టార్‌లో ఉన్న సినిమాలను, వెబ్ సిరీస్‌లను 3 నెలల పాటు ఆస్వాదించవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. జియో తీసుకొచ్చిన ఈ డేటా ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ను పొందే అవకాశం ఉంది. యూజర్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కేవలం మొబైల్‌కు మాత్రమే.
* క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) డెఫినిషన్ను సవరించాలని సెబీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఏంజెల్ ఫండ్స్‌లో 200 ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ మంది ఉండకూడదనే లిమిట్‌ను తీసేయనుంది. దీంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఏంజెల్ ఫండ్స్‌ను ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. ఇవి ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు ఎంత మేర రిస్క్ తీసుకోగలరు? వీరు ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్నారా? కంపెనీల చట్టం కింద ప్రైవేట్ ప్లేస్మెంట్ రెగ్యులేషన్స్‌కు విరుద్ధంగా ఉంటుందా? వంటి సమస్యలను పరిష్కరించేందుకు సెబీ కేవలం గుర్తింపు పొందిన ఇన్వెస్టర్ల (అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లు–ఏఐల) నే ఏంజెల్ ఫండ్స్‌లో జాయిన్ అయ్యేందుకు అనుమతి ఇవ్వనుంది.
* పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో సోమవారం భారత్‌లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.350 పెరిగి.. పది గ్రాములకు రూ.89,100కి పెరిగింది. దాంతో బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది. మరో వైపు వెండి కిలోకు రూ.లక్ష పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. శుక్రవారం బంగారం పది గ్రాములకు రూ.88,750 వద్ద ముగిసింది. సోమవారం బంగారం ధర రూ. 350 పెరిగి 10 గ్రాములకు రూ. 89,100కు చేరుకుంది. 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.350 పెరిగి 10 గ్రాములకు రూ.88,700కి చేరింది. విదేశీ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 2,954.71 డాలర్లు పలుకుతున్నది. స్పాట్ గోల్డ్ 5.50 డాలర్లు పెరిగి ఔన్సుకు 2,941.55 డాలర్లకు చేరుకుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z