Business

పెరిగిన బంగారం ధర. ఆగని రూపాయి పతనం-BusinessNews-Feb 25 2025

పెరిగిన బంగారం ధర. ఆగని రూపాయి పతనం-BusinessNews-Feb 25 2025

* రూపాయి పతనం నేపథ్యంలో వరుసగా రెండోరోజూ బంగారం ధర పెరిగింది. పసిడి ధర రూ.250 పెరగడంతో తులం ధర రూ.89,350కి చేరుకుందని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.250 పెరిగి పది గ్రాములకు రూ.88,950కి చేరుకుంది. ఇక వెండి ధరలు మాత్రం రూ.500 తగ్గి కిలోకు రూ.99,500 పలుకుతున్నది. డాలర్‌ ఇండెక్స్‌ పెరుగుల కారణంగా వెండి ధర తగ్గిందని మెహతా ఈక్విటీస్‌ లిమిటెడ్‌ కమోడిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కలాంత్రి పేర్కొన్నారు. ట్రంపు సుంకాల భయాలు, ఒత్తిడి కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సైతం ఇబ్బందులుపడుతున్నాయి. అయితే, యూఎస్‌ ట్రెజరీ దిగుబడిలో తిరోగమనం వెండి ధరలు పెరుగుదల తక్కువగానే ఉండవచ్చని అంచనా. వాణిజ్య సుంకాలపై అనిశ్చితి మధ్య.. యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి 51 పైసలు తగ్గి రూ.87.23 వద్ద ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ.275 పెరిగి రూ.86,459కి చేరుకుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో బలహీన సంకేతాల మధ్య మార్కెట్లు ఉదయం ప్లాట్‌గానే మొదలయ్యాయి. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నా.. చివరి సెషల్‌లో సూచీలు పడిపోయాయి. సెన్సెక్స్‌ ఉదయం కిత్రం సెషన్‌తో పోలిస్తే.. 74,440.30 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 74,400.37 పాయింట్ల కనిష్ఠానికి పతనమైన సెన్సెక్స్‌.. గరిష్ఠంగా 74,785.08 పాయింట్లను చేరుకుంది. చివరకు 147.71 పాయింట్ల లాభంతో 74,602.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.80 పాయింట్లు తగ్గి 22,547.55 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,612 లాభపడ్డాయి.

* ఇండియా టెక్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.26 లక్షల ఉద్యోగాలను ఇచ్చిందని, దీంతో ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరుకుందని నాస్కామ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఐటీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, బిజినెస్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ (బీపీఎం) , గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు టెక్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ కిందకు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 1,760 గ్లోబల్‌‌‌‌‌‌‌‌ జీసీసీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, 19 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా నియామకాలు జరుగుతాయని నాస్కామ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రాజేష్ నంబియార్ పేర్కొన్నారు. మరోవైపు ఇండియా టెక్ సెక్టార్ రెవెన్యూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 282.6 బిలియన్ డాలర్ల (రూ.24 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 300 బిలియన్ డాలర్ల (రూ.26 లక్షల కోట్ల) ను దాటుతుందని అంచనా వేశారు.

* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరుగుతుండడంతో రానున్న మూడేళ్లలో నాలుగు వేల మంది ఉద్యోగులను తగ్గించుకుంటామని నాస్కామ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో డీబీఎస్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ సీఈఓ పీయూష్‌‌‌‌‌‌‌‌ గుప్తా పేర్కొన్నారు. ‘ఈ ఏడాది నా అంచనా ఏంటంటే, రానున్న మూడేళ్లలో మొత్తం వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో 10 శాతం మందిని తగ్గించుకుంటాం. ఏఐ శక్తివంతమైంది. ఇది స్వతహాగా క్రియేట్ చేయగలదు. ఇతరులను అనుసరించగలదు’ అని గుప్తా పేర్కొన్నారు. గత పదేళ్లలో డీబీఎస్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగుల కోత జరగలేదని చెప్పారు. పైన పేర్కొన్న 4 వేల మంది ఉద్యోగుల్లో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌, టెంపరరీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారని నాస్కామ్ ఈవెంట్ తర్వాత డీబీఎస్ వివరణ ఇచ్చింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z