* చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్‌కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్‌జెట్‌పై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్‌జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్‌జీఎఫ్ ఆల్ఫా, ఎన్‌జీఎఫ్ జెనెసిస్, ఎన్‌జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్‌జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్‌జెట్‌కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి. ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్‌జెట్‌కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్‌జెట్.. ఎన్‌సీఎల్‌టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్‌సీఎల్‌ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్‌కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది.
* సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2030 నాటికి మహిళల సంఖ్య 30 శాతం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వేదాంత తెలిపింది. మహిళా సిబ్బందిలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లో 28% మంది ఉన్నారని, ఇది దేశంలో మెటల్స్, మైనింగ్ కంపెనీల్లోనే అత్యధికమని పేర్కొంది. అర్హత కలిగిన మహిళలకు తగిన స్థానం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. అనువైన పని గంటలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, పిల్లల సంరక్షణ కోసం ఏడాదంతా సెలవులు, జీవిత భాగస్వామి నియామకం తదితర స్నేహపూర్వక విధానాల అమలు ద్వారా ప్రతి దశలోనూ మహిళల ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్ జింక్ ఉమెన్ ఆఫ్ జింక్ క్యాంపేయిన్ ప్రారంభించింది. మెటల్ రంగం పట్ల మహిళల్లో మరింత ఆసక్తిని పెంచడం ఈ ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
* హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఫౌండర్ శివ్‌నాడార్ కంపెనీలోని తన వాటాలో 47 శాతాన్ని కూతురు రోషిణీ నాడార్ మల్హోత్రాకు కానుకగా ఇచ్చారు. వామా ఢిల్లీలోనూ వాటాలను అప్పగించారు. దీంతో ఆమె రెండు కంపెనీల్లో మెజారిటీ షేర్‌హోల్డర్ అయ్యారు. వీటిలో ఓటింగ్ హక్కులపైనా ఆమెకు నియంత్రణ దక్కుతుంది.
* ChatGPT మాతృసంస్థ OpenAI కొత్తగా మూడు AI ఏజెంట్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇవి వివిధ డొమైన్లపై స్పెషల్ ఇంటె లెక్చువల్ సమాచారాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి. ఇవి ఇప్పుడు సబ్ స్క్రిప్షన్లలో అందించబడువు. వీటికి ప్రత్యేక సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కాస్ట్ లీ సబ్ స్క్రిప్షన్ ఉంటుంది. ఈ AI ఏజెంట్లు ఏవిధంగా పనిచేస్తాయి.. వీటి సబ్ స్క్రిప్షన్ ఎంతుంటుంది. ఎప్పటినుంచి ఇవి అందుబాటులోకి వస్తాయో .. వివరాల్లోకి వెళితే..ది ఇన్ఫర్మేషన్ కొత్త రిపోర్టు ప్రకారం..శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన OpenAI సంస్థ మూడు కొత్త AI ఏజెంట్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇవి వారి నాలెడ్జ్ విషయంలో అత్యంత ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఈ AI ఏజెంట్లు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ 20,000 డాలర్లు అంటే సుమారు రూ. 17లక్షల 41వేలుఉండవచ్చని పేర్కొంది. ఈ AI ఏజెంట్లలో ఒకటి బెస్ట్ స్కిల్స్ ఉన్న ఇంకమ్ సంపాదించిపెట్టే ఎంప్లాయీగా ఉంటుందని చెబుతోంది. వ్యూహాత్మక ప్లానింగ్, క్రిటికల్ థింకింగ్, డెషిషన్ మేకింగ్ వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుంది.దీని సబ్ స్క్రిప్షన్ దాదాపు 2వేల డాలర్లు అనగా రూ.1లక్షా 74వేలకు పైగా ఉంటుందని చెబుతోంది.
* గత మూడు రోజులుగా బంగారం ధరలుస్థిరంగా ఉన్నాయి. ఆదివారం (మార్చి 9) న స్పల్పంగా తగ్గాయి. బంగారం కొనుక్కోవాలనుకునేవారికి ఇదే మంచి సమయం. 2025 ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు..ఈ వారంలో కొద్దిగా నెమ్మదించాయి. ముఖ్యంగా గడిచిన మూడు రోజుల్లో బంగారం ధరలో చాలా స్పల్ప మార్పులే ఉన్నాయి. ఇక ఆదివారం (మార్చి9) హైదరాబాద్ తోపాటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధర పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87వేల 710 లుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80వేల 400లుగా ఉంది.
ఇక వెండి విషయానికొస్తే గత కొద్దిరోజులుగా వెండి ధర పెరుగుతూనే ఉంది. కిలో వెండి ధర రూ. లక్షకు చేరింది.. ఈ మధ్య కాలంలో స్పల్పంగా తగ్గింది. ఆదివారం కూడా వెండి ధర తగ్గింది. హైదరాబాద్ లో ఇవాళ కిలో వెండి ధర రూ. 99వేల 100గా ఉంది.
మార్చి 9న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
నగరం 22K బంగారం (ప్రతి 10 గ్రాములకు) 24K బంగారం (ప్రతి 10 గ్రాములకు)
ఢిల్లీ రూ. 80,550 రూ. 87,860
జైపూర్ రూ. 80,550 రూ. 87,860
అహ్మదాబాద్ రూ. 80,450 రూ. 80,450
పాట్నా రూ. 87,760 రూ. 87,760
ముంబై రూ. 80,400 రూ. 87,710
హైదరాబాద్ రూ. 80,400 రూ. 87,710
చెన్నై రూ. 80,400 రూ. 87,710
బెంగళూరు రూ. 80,400 రూ. 87,710
కోల్‌కతా రూ. 80,400 రూ. 87,710
మరోవైపు ప్రధాన భారతీయ నగరాల్లో స్పాట్ మార్కెట్‌లో వెండి ధరలు కిలోకు రూ.99,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z