* ఈ నెలలో (మార్చి 2025) దాదాపు పది రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉన్నాయి. కాగా ఈ ఒక్క వారంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ఉన్నాయి, ఆ సమయంలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా? అనే వివరాలు తెలుసుకుందాం.
మార్చి రెండో వారం కూడా మొదలైపోయింది. ఈ వారంలో 13 నుంచి 16వరకు వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులు రావడం చేత.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైనా పరవాలేదు అనుకున్నప్పుడు.. ఎప్పుడు బ్యాంకులు మూసి ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.
➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.
➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.
➤ మార్చి 16 (ఆదివారం); ఆదివారం కావడం చేత దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
* సోమవారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 74,115.17 వద్ద, నిఫ్టీ 92.20 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 22,460.30 వద్ద నిలిచాయి. వెల్‌స్పన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ కమర్షియల్స్, బంకా బయోలూ, బోడల్ కెమికల్స్, లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ICE మేక్ రిఫ్రిజిరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కేసోరామ్ ఇండస్ట్రీస్, SBC ఎక్స్‌పోర్ట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్, నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
* కన్నడ నటి ‘రన్యా రావు’ 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దుబాయ్ బంగారం ధరల గురించి చర్చ మొదలైంది. ఇంతకీ దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావాలి?, ఎక్కువ తీసుకురావాలనే ఏమైనా రూల్స్ పాటించాలా? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా.. పురుషులు 20 గ్రా, మహిళలు 40 గ్రా తెచ్చుకోవచ్చు. అయితే వీరు తెచ్చుకునే బంగారం.. గోల్డ్ బార్లు, కాయిన్స్ రూపంలో ఉండాలి. అయితే 15 ఏళ్లలోపు పిల్లలకు 40 గ్రా పరిమితి ఉంది. వీరికోసం కొనుగోలు చేసే బంగారం.. నగలు, గిఫ్ట్స్ రూపంలో ఉండాలి. కస్టమ్స్ డ్యూటీ వెరిఫికేషన్ సమయం.. బంగారం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను చూపించాల్సి ఉంటుంది. పిల్లలకు అయితే.. తల్లితండ్రులు లేదా గార్డియెన్లకు సంబంధించిన ఐడీ కార్డు ఉండాలి.
* రంజాన్, దసరా లాంటి పండగల సమయాల్లో ఉపవాసం ఉండేవారి కోసం ప్రత్యేకంగా ఫాస్టింగ్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చింది స్విగ్గీ. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండేవారు ఈ ఆప్షన్ ని ఆన్ చేస్తే.. తెల్లవారు జాము నుంచి సాయంత్రం 4 గంటల తర్వాత ఉపవాసం ముగిసే వరకు యాప్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ రావు. తిరిగి ఉపవాస సమయం ముగిసాక.. యూజర్లు ఆఫ్ చేయకుండానే ఈ ఫీచర్ ఆఫ్ అయ్యి.. రంజాన్ స్పెషల్ ఫుడ్స్ పై ఉన్న ఆఫర్స్, స్పెషల్ డిషెస్ తో కూడిన నోటిఫికేషన్స్ వస్తాయి. దసరా, దీపావళి, లాంటి ఇతర పండగల సమయాల్లో కూడా ఫాస్టింగ్ మోడ్ ఫీచర్ ఇలాగే పని చేస్తుంది. ఏదేమైనా స్వగ్గీ ఐడియా సూపర్ గా ఉందనే చెప్పాలి.. ఫాస్టింగ్ సమయాల్లో యాప్ ని అన్ ఇన్స్టాల్ చేయకుండా ఉండటంతో పాటు ఉపవాస సమయం ముగిసాక స్పెషల్ ఆఫర్స్ తో కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా ఉంది ఫాస్టింగ్ మోడ్.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z