నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు టంపా వేదికగా 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్నారు. సంబరాల తొలి ఆహ్వాన పత్రికను నాట్స్ నాయకులు కాణిపాకం విఘ్నేశ్వరుడికి అందించారు. సంబరాలు నిర్విఘ్నంగా, దిగ్విజయంగా జరిగేలా కోరుకుంటూ కాణిపాకం విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అతి పెద్ద తెలుగు పండుగ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలని సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. ఈ సంబరాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు కాణిపాకం విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం పొందేందుకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని ఆయన తెలిపారు. సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z