24వ తానా ద్వైవార్షిక సమవేశాలు జూలై 3,4,5 తేదీలలో నోవై (డిట్రాయిట్) సబర్బన్ షో ప్లేస్ లో నిర్వహిస్తున్నారు. దీని ఏర్పాట్లలో భాగంగా, మార్చి 8 (శనివారం) ఉదయం సర్వ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో 25 కమిటీలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. రాబోయే నాలుగు నెలలలో చేపట్టాల్సిన పనుల ప్రణాళికను సభల కన్వీనర్ చాపలమడుగు ఉదయకుమార్ వివరించారు. ఏప్రిల్ నుంచి అన్ని తానా రీజియన్లలో ధీంతానా, ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని, 3000 మంది ఒకేసారి భోజనం చేసేందుకు అనువుగా భోజనశాలను సిద్ధం చేశాఅమని తెలిపారు. రిజిస్ట్రేషన్ కమిటీ సిద్ధంగా ఉందని, సభల వెబ్ సైట్ మార్చి 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
అక్టోబర్‌లో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో 3 మిలియన్ డాలర్లకు హామీలు ఇచ్చిన దాతలను సంప్రదించి నిధులను సేకరించే పనికి శ్రీకారం చుట్టామని ఉదయకుమార్ వెల్లడించారు. నిధులు రాబట్టడం, రిజిస్ట్రేషన్ చేయించటం, మహాసభలకు ఆహ్వానితులను నిర్ణయించటం అనే మూడు ప్రధాన విషయాలపై దృష్టి సారించి మార్చి నెలాఖరుకు పూర్తి చేయ్యాలని కమిటీలను దిశానిర్దేశం చేశారు. మాహాసభలకు ప్రముఖులను ఆహ్వానించటానికి సభల ఛైర్మన్ నాదెళ్ళ గంగాధర్ ఇండియాలో పర్యటిస్తున్నారని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z