నాట్స్ విశాఖలోని విభిన్న ప్రతిభావంతుల విద్యాలయం సన్ ప్లవర్ స్కూల్‌కి రూ. 20 లక్షలను విరాళంగా అందించింది. ఈ మొత్తాన్ని సన్ ప్లవర్ స్కూలుకి కొత్త బస్సు కోనుగోలుకు వినియోగించనున్నారు. ఈ స్కూలు కోసం ఎవల్ట్యూజ్ సంస్థ వ్యవస్థాపకులు, నాట్స్ బోర్డ్ మాజీ డైరక్టర్ శ్రీనివాస్ అరసడ 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం సేవలను అందిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సేవా సంస్థలకు చేతనైన చేయూత అందిస్తున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు. భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదమని.. దానికి తగ్గట్టుగానే నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకే ప్రవాసాంధ్రులు నాట్స్‌తో కలిసి పనిచేస్తున్నారని.. వారి సహకారంతో నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల అసలు పరమార్థం కూడా సేవే అని నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. టంపా వేదికగా జులై 4,5,6 తేదీల్లో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తదితరులు పాల్గొన్నారు.
ఏయూ విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర యూనివర్సీటీ పూర్వ విద్యార్థి తాళ్లూరి పూర్ణ చంద్రరావుల ఆర్ధిక సహకారంతో ఆంధ్ర యూనివర్సీటీలో కొత్తగా నిర్మించిన విశ్వేశ్వరయ్య వసతి గృహానికి పడకమంచాలను అందించారు. విద్యార్ధులకు నిద్రకు ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో తయారుచేసిన 432 మంచాలను తయారు చేయించి ఏయూ హాస్టల్‌కి బహుకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z