NRI-NRT

శ్రీవారికి నాట్స్ సంబరాలకు ఆహ్వానం

శ్రీవారికి నాట్స్ సంబరాలకు ఆహ్వానం

ఫ్లోరిడాలోని టంపాలో నాట్స్ జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి శ్రీవారి ఆశీస్సులు కోరింది.

అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నాట్స్ బృందం ఆహ్వానించింది. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.

https://sambaralu.org/

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z