NRI-NRT

మిల్పిటాస్‌లో సాత్విక్ మీల్స్ ఫౌండేషన్ గ్రాండ్ లాంచ్

మిల్పిటాస్‌లో సాత్విక్ మీల్స్ ఫౌండేషన్ గ్రాండ్ లాంచ్

సాత్విక్ మీల్స్ ఫౌండేషన్ మిల్పిటాస్‌లో విజయవంతంగా ప్రారంభించబడింది. విద్య, ప్రభుత్వం, వ్యాపారం, దాతృత్వ రంగాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చంచలపతి ప్రభు తన ప్రసంగంలో 2023 జూన్‌లో ప్రారంభమైన అక్షయపాత్ర విజయాన్ని USAలో విస్తరించాలనే లక్ష్యం ఫలించిందని చెప్పారు. డి అంజా కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఒమర్ టోర్రెస్ విద్యార్థుల ఆహార భద్రతపై తన సందేశాన్ని అందించగా, ఓహ్లోన్ కళాశాల అధ్యక్షుడు చార్లెస్ ససాకి ప్రారంభ వీడియోను అధికారికంగా ప్రారంభించారు. కుపెర్టినో మేయర్ ఫౌండేషన్ లాంచ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర USA బోర్డు సభ్యులు, దేశ్ దేశ్పాండే, రంగస్వామి వంటి ప్రముఖ వ్యాపార నేతలు పాల్గొన్నారు. TiE సిలికాన్ వ్యాలీ అధ్యక్షురాలు అనితా మన్వాణి హృదయపూర్వక స్వాగతం పలికారు. శివ శివరాం-రంజనాలు ఆతిథ్యం అందించారు.

న్యూజెర్సీ, బోస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్ డ్ఛ్లో సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. ప్రస్తుతం మిల్పిటాస్‌లో రెండు కమ్యూనిటీ కళాశాలలతో సేవలు అందించబడుతున్నాయి. ఈ ఏడాది 50,000 భోజనాలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రయత్నం, 2030 నాటికి ఒక మిలియన్ భోజనాలుగా విస్తరించేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన 200 మందికి పైగా అతిథులు ఈ విశిష్టమైన సందర్భాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. మిల్పిటాస్ వైస్ మేయర్, భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ అధికారులు తమ మద్దతు ప్రకటించారు. సాత్విక్ మీల్స్ ఫౌండేషన్ లక్ష్యం – ఆకలితో బాధపడే విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడం!

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z