ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఆ సంస్థ ప్రతినిధులు భారత్‌లో పర్యటిస్తూ అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో సినీప్రముఖులను సంబరాలకు ఆహ్వానించామని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు.
కె. రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు థమన్, దర్శకులు హరీశ్ శంకర్, మోహర్ రమేశ్ తదితరులను ఆహ్వానించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు.
##########
శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై నాట్స్-గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లోల సమ్యుక్త సమన్వయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z