ScienceAndTech

గుంటూరు జిల్లా పోలీస్‌కు డ్రోన్ బహుకరించిన ఉప్పుటూరి ట్రస్ట్

గుంటూరు జిల్లా పోలీస్‌కు డ్రోన్ బహుకరించిన ఉప్పుటూరి ట్రస్ట్

పోలీసింగ్ అవసరాల నిమిత్తం వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన ఉప్పుటూరి చిన్నరాములు, ఆయన కుమారుడు ఉప్పుటూరి రామ్ చౌదరి(USA) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉప్పుటూరి చిన్నరాములు సేవా ట్రస్ట్ తరఫున అత్యాధునిక సాంకేతికతతో కూడిన DJI Air3s డ్రోన్ కెమెరాను గుంటూరు జిల్లా పోలీస్ విభాగానికి అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఉప్పుటూరి చిన్నరాములుని శుక్రవారం నాడు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ సన్మానించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..డ్రోన్ టెక్నాలజీని వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని, ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో చైన్‌ స్నాచింగ్స్‌, ఈవ్‌ టీజింగు, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు/నిశిత ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్‌ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామని సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రజా రక్షణ కొరకు పోలీసు వారు చేస్తున్న కృషికి, సేవలకు తమ వంతు సహకారం అందించడానికి మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను బహుకరించాలని కోరుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z