Business

లాభాల్లోకి మార్కెట్లు-BusinessNews-Mar 18 2025

లాభాల్లోకి మార్కెట్లు-BusinessNews-Mar 18 2025

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. చాలారోజుల రోజుల తర్వాత సెన్సెక్స్‌ వెయ్యిపాయింట్లకుపైగా లాభపడింది. దాంతో సెన్సెక్స్‌ 75వేల పాయింట్ల ఎగువ ముగియగా.. నిఫ్టీ 23వేల పాయింట్లకు చేరువైంది. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు, బ్యాంకింగ్‌ రంగంలో కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 74,608.66 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సూచీలు పెరుగుతూ వచ్చాయి.

* బ్యాంకులకు కుచ్చుటోపీలు పెడుతున్న కేటుగాళ్లు.. గుదిబండలుగా మారుతున్న కార్పొరేట్లు.. అధికారులతో కలిసి వందలు, వేల కోట్లను మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల ఆగడాలు ఎంతకీ తగ్గడం లేదు. గడిచిన 10 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని బ్యాంకులు దాదాపు రూ.16.35 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిల (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు)ను రైటాఫ్‌ చేశాయని సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు మరి. సామాన్యుల దగ్గర్నుంచి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకర్లు.. వేల కోట్లను ఎగవేసినా ఏండ్ల తరబడి కిమ్మనకుండా ఉండిపోతుండటం.. రైటాఫ్‌ల పేరిట ఖాతా పుస్తకాలను క్లియర్‌ చేసుకుంటుండటం.. అటు పాలనాపరంగా, ఇటు చట్టాలు-వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిస్తున్నాయి.

* బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్‌ హై రికార్డులతో హోరెత్తించాయి. సోమవారం దేశీయ మార్కెట్‌లో అటు గోల్డ్‌, ఇటు సిల్వర్‌ రెండింటి రేట్లూ పరుగులు పెట్టాయి. ఏకంగా రూ.1,300 చొప్పున ఎగబాకి మునుపెన్నడూలేని స్థాయిల్లో స్థిరపడ్డాయి. అఖిల భారత సరఫా అసోసియేషన్‌ వివరాల ప్రకారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.1,300 పుంజుకొని మొదటిసారి రూ.90వేల మార్కును దాటుతూ రూ.90,750గా నమోదైంది. దీంతో మునుపటి రూ.89,450 రికార్డు చెరిగిపోయినైట్టెంది. మరోవైపు వెండి ధరలూ దౌడు తీశాయి. కిలో ధర ఈ ఒక్కరోజే రూ.1,300 ఎగిసి రూ.1,02,500గా నమోదైంది. ఈ స్థాయికి వెండి ధర రావడం ఇదే తొలిసారి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z