ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ తానా మహాసభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలను ఆహ్వానించారు. డెట్రాయిట్‌లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే ఈ సభల్లో పాల్గొనవల్సిందిగా కోరారు. ఆహ్వానం అందుకున్న వారిలో దగ్గుబాటి పురందేశ్వరి, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు, ఎంపీలు కేశినేని చిన్ని, సిఎం. రమేశ్, లావు కృష్ణ దేవరాయ తదితరులు ఉన్నారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, పాతూరి నాగభూషణం, చందు గొర్రెపాటి, శశి దొప్పలపూడి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z