‘మన తెలుగు సంబరం.. జరుపుదాం కలిసి అందరం’ అనే నినాదంతో జులై 4 నుంచి 6వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆధ్వర్యంలో 8వ అమెరికా సంబరాలు జరగనున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ట్యాంపా పట్టణంలో వేడుకలు నిర్వహించనున్నట్లు నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ శివారులోని అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. వేడుకలకు సినీ ప్రముఖులతోపాటు సుమారు 10వేల మంది హాజరుకానున్నట్లు తెలిపారు. ఈసారి తెలుగు భాషకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సంగీత దర్శకులు తమన్, దేవీశ్రీప్రసాద్‌ల సంగీత విభావరితోపాటు అమెరికా-11, నాట్స్-11 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సంబరాల కార్యదర్శి మల్లాది శ్రీనివాస్, తదుపరి అధ్యక్షుడ్ మందాడి శ్రీహరి, నిర్మాత నవీన్, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేశ్, నటీమణులు జయసుధ, ఆమని, సన, గేయ రచయితలు రామజోగయ్యశాస్త్రి, చంద్రబోస్‌తోపాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z