డిట్రాయిట్‌లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న తానా 24వ మహాసభలకు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. రేవంత్ తానాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని సభల్లో పాల్గొనడంపై సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, మహాసభల డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి, కన్నా దావులూరు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z