Devotional

నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు..శ్రీవారి మెట్టు మార్గంలో 5నుంచి అనుమతి

నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు..శ్రీవారి మెట్టు మార్గంలో 5నుంచి అనుమతి

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సమావేశం ముగిసిన తర్వాత పాలకమండలి నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
తితిదే నిర్ణయాలు…

*టైం స్లాట్‌ దర్శనాలు, టోకెన్లు కొనసాగించాలని తితిదే నిర్ణయం.

* నడక దారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ ప్రక్రియ.

* తిరుమల బాలాజీనగర్‌ వద్ద 2.86 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్‌ బస్‌ స్టేషన్‌ ఏర్పాటు.

* శ్రీవారి మెట్టుమార్గంలో మే 5 నుంచి భక్తులకు అనుమతి.

* శ్రీనివాస సేతు రెండోదశ పనులకు రూ.100కోట్లు కేటాయింపు.

* తితిదే ఉద్యోగుల వసతి గృహాల ఆధునికీకరణకు రూ.19.40కోట్లు.

* ఇకపై వస్తురూపంలో విరాళాలు ఇచ్చే దాతలకూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.