Politics

కొడాలి దేవినేనికి కృతజ్ఞుడిగా ఉండాలి

Vijayawada MP Kesineni Advice To Kodali Over Devineni Uma

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో మరోసారి చెలరేగారు. ఈసారి మంత్రి కొడాలి నానిపై పోస్ట్ పెట్టారు. తనను మంత్రిని చేసిన దేవినేని ఉమకు..కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ కేశినేని నాని పోస్ట్ చేశారు. మెసేజ్ కింద నవ్వుతున్న ఎమోజీ కూడా పెట్టారు. ఇదిప్పుడు పెద్ద చర్చకే దారి తీస్తోంది. ఇంతకీ ఇది కొడాలి నానీని పొగిడినట్టా.. లేదంటే దేవినేని ఉమను తిట్టినట్టా అనే దానిపై ఎవరి విశ్లేషణ వాళ్లు చేసుకుంటున్నారు.కృష్ణా జిల్లాలో పార్టీ ఓటమికి దేవినేని ఉమ తీరే కారణమంటూ.. కేశినేని నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటూ సన్నిహితులు చెప్తున్నారు. ఉమ తీరు వల్లే తెలుగుదేశానికి ఈ పరిస్థితి వచ్చిందన్న వాదన కూడా ఎంపీ వర్గం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రి కొడాలి నానీని పొగుడుతూ పోస్ట్ పెట్టడం అంటున్నారు. గత వారం కూడా ఎంపీ నాని ఇలాంటి పోస్టే పెట్టారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ మెసేజ్ చేశారు.