మరి వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్ కదా! ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా ఈ పండ్లను టేస్ట్ చేస్తారు. అయితే, కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో మామిడి తనకు తానే సాటి. మామిడి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందామా?!
**100 గ్రాముల మామిడి పండులో లభించే పోషకాలు
►ప్రొటిన్- 1.4 గ్రాములు
►కార్బోహైడ్రేట్స్-24.7 గ్రాములు
►షుగర్- 22.5 గ్రాములు
►ఫైబర్- 2.6 గ్రాములు
►కేలరీలు 60
►విటమిన్ సీ- రోజూ ఓ మామిడి పండు తింటే 67 శాతం లభిస్తుంది.
►వీటితో పాటు కాపర్, థయామిన్, మోగ్నీషియం, నియాసిన్, పొటాషియం, రైబోఫ్లావిన్ కూడా ఉంటాయి.
మామిడి ఆరోగ్య ప్రయోజనాలు
►మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీతో పాటు కెరోనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి.
►ఇక ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.
►ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలు మామిడి పండ్లు తినడం వల్ల ఐరన్, కాల్షియం తగు పాళ్లలో లభిస్తాయి.
►మామిడిలోని ఎంజైమ్‌లు ప్రొటిన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. అధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది కాబట్టి ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
►ఇందులో విటమిన్ ఏ పుష్కలం కాబట్టి కంటి సమస్యలు దూరమవుతాయి. పొడిబారిన కళ్లు, రేచీకటిని నివారించడంలో ఇవి తోడ్పడతాయి.
►మామిడిలో ఉండే పోషకాల కారణంగా ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడమే ►కాకుండా అదనపు కేలరీలను కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
►ఇందులో టార్టారిక్, మాలిక్ యాసిడ్స్ ఎక్కువ. సిట్రిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సాయం చేస్తాయి.
►ఇక మధుమేహంతో బాధపడే వారు మామిడి ఆకులను తింటే మేలు. ఐదు నుంచి ఆరు ఆకులను నీటిలో వేడిచేసి.. రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. మామిడి గ్లేసెమిక్ ఇండెక్స్ తక్కువ. షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది.
►చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది.
►యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్వార్సెటిన్(కాన్సర్ కణాలను నశింపజేస్తుంది), ఫిసెటిన్, ఐసోక్వెర్సిటిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్.. ఇవన్నీ కాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. బ్రెస్ట్ కాన్సర్, కొలన్ కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్, లుకేమియాను నివారించడంలో తోడ్పడతాయి.