Movies

No Stupids Please

Shruti Hassan Opens Up About Her Life Partner Choices

‘‘సెన్సాఫ్‌ హ్యూమర్‌… ఇంటిలిజెన్స్‌… విల్‌ పవర్‌… కాబోయే భర్తలో ఈ మూడు లక్షణాలు ఉండాలి. అబ్బాయి స్టుపిడ్‌లా అసలు ఉండకూడదు’’ అని శ్రుతీ హాసన్‌ అన్నారు. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని తాజా ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ముందు ‘నాకు భర్త అవసరం లేదు’ అన్నట్టు ‘‘ఐ డోంట్‌ నీడ్‌…’’ అనేశారు శ్రుతి. తర్వాత ‘‘ఒకవేళ పెళ్లి చేసుకోవాలనిపిస్తే…’’ అని సమాధానం ఇచ్చారు. ఇంకా శ్రుతీ హాసన్‌ మాట్లాడుతూ ‘‘నాకు సహనం చాలా తక్కువ. ప్రపంచంలో స్టుపిడ్‌ పీపుల్‌ ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళను భరించడం కష్టం’’ అన్నారు. త్వరలో తెలుగు సినిమా చేస్తున్నానని స్పష్టం చేశారామె. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో శ్రుతీ హాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.