*నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి (25) అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి.
* బీర్పూర్ మండలం తుంగర్లో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడి చేశాడు. పంటకు స్ప్రే చేసే డబ్బాతో అధికారులపై పెట్రోల్ చల్లాడు. అధికారులపై గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణకు గాయాలయ్యాయి. ఎస్ఐ తృటిలో తప్పించుకున్నారు.
*వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ యువతికి మరొకరితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు.. తన ప్రియుడితో కలిసి పురుగుల మందు సేవించి, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముల్కలపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది.మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తురకలగూడేనికి చెందిన మడకం సోనా(20), దేవీ(18) అనే యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. దేవీ ముల్కలపల్లి మండల పరిధిలోని ధర్మన్ననగర్ వాసి. అయితే వీరిద్దరూ సమీప బంధువులు కూడా. అయితే దేవీకి ఇటీవలే పెళ్లి సంబంధం కుదిర్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. సోమవారం రాత్రి అన్నారం శివారు అటవీ ప్రాంతంలో గ్రామస్తులు రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను ఇంటి నుంచి అదృశ్యమైన దేవీ, ఆమె ప్రియుడు సోనాగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో ఉన్న పురుగుల మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ పెద్దపెల్లి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి పట్టణానికి చెందిన మల్లోజుల మూర్తి తన స్నేహితుడైన తిరుపతికి 2014 సంవత్సరంలో రూ.2,40,000 అప్పుగా ఇచ్చాడు. కాగా, అప్పు తీర్చేందుకు తిరుపతి, మూర్తికి చెక్కు రాసిచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ అవడంతో మూర్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
*సీబీఐ బృందం కారు డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో సీబీఐ బృందం కారు డ్రైవర్ (driver) ఫిర్యాదు చేశారు. కడప జిల్లా వదిలి వెళ్లకపోతే చంపుతామంటూ.. దుండగులు పాత బైపాస్ రోడ్ దగ్గర కారును ఆపి డ్రైవర్‌ను బెదిరించారు. బెదిరింపుల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఫిర్యాదుపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
*మనుబోలు బద్వేల్ క్రాస్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పంచర్ కావడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*కృష్ణా జిల్లాలో పెదపారుపూడి మండలం పెదపారుపూడి గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి 7 కాసుల బంగారాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు. కాగా మహిళ ప్రతిఘటించడంతో ఆమెను దుండగుడు ఈడ్చుకెళ్లాడు. దీంతో మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*కంభం మండలం లింగాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆరుబయట నిద్రస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు మహిళలపై పడటంతో ఫాతిమా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో మహిళ రామలింగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మహిళను కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మహిళను మెరుతైన చికిత్స కోసం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
*నిజామాబాద్: జిల్లాలోని కమ్మర్పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో చిన్నారి శరణ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం స్థానికులు శరణ్యను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తలిరంచారు. బైక్‌ను ఢీకొట్టి వాహనం ఆపకుండానే వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి..వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులు: దంపతులు కృష్ణ, రజిత, కూతురు రాగిణిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
*రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ గండి పేట వైజంక్షన్ వద్ద రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. కారులో నుండి మంటలు రావడాన్ని గుర్తించిన యజమాని వెంటనే కిందకు దిగాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే యజమాని కళ్ల ముందు కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారు యజమాని ప్రాణాలతో బయటపడ్డాడు. మెహదీపట్నం నుండి మొయినాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కారు యజమాని శ్రీ హరి ఓ పత్రికా విలేకరిగా గుర్తించారు.
*కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధమయింది. ఏగుర్ల ఓదయ్య అనే వ్యక్తి 11 నెలల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. ఆదివారం రాత్రి స్కూటర్లోనే బ్యాటరీ ఉండగా చార్జింగ్ పెట్టి పడుకున్నాడు. సోమవారం తెల్లవారు జూమున పెద్ద శబ్ధం వినిపించింది. బయటకు వెళ్లి చూడగా ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిపోతూ కనిపించింది. బ్యాటరీ పేలిపోవడంతోనే మంటలు వ్యాపించి స్కూటర్ దగ్ధమయిందని ఓదయ్య తెలిపాడు.
*నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తనను ఓ హోటల్‌కు పిలిపించి, మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. సెల్పోన్లో తన నగ్న చిత్రాలు, వీడియోలను చిత్రీకరించి.. బ్లాక్మెయిల్ చేశాడని వాపోయారు. బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలికి 2020 మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లాను కేటాయించారు. ఆ సమయంలో సదరు నాయకురాలికి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ‘‘నా భార్య ఆరోగ్యం బాగుండదు. మూడేళ్లకు మించి బతకదు. నాకో తోడు కావాలి. నిన్ను పెళ్లి చేసుకుంటా’’ అని ఆమెను నమ్మించాడు. ‘‘దుబ్బాక ఎన్నికల సమయంలో ఓ రోజు రాత్రి శివకుమార్‌రెడ్డి తప్పతాగి.. బాధితురాలు ఉంటున్న గదికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు. పెళ్లికానిదే, అవేమీ ఉండవని సున్నితంగా తిరస్కరించా. జుట్టుపట్టుకుని, తీవ్రంగా దాడి చేశాడు.
*జహీరాబాద్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బొలెరో, ఓ ప్రయివేటు బస్సు ఢీకొన్నాయి. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. బొలెరో వాహనంలోని వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
*చైనా రుణయా్‌పల కేసులో ఢిల్లీకి చెందిన సీబే ఇంటర్నేషనల్ సంస్థ భాగస్వామి దీపక్ నాయర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. దీపక్ నాయర్ నకిలీ ఎయిర్ వే బిల్లులు సృష్టించి రూ.1146 కోట్లను హాంకాంగ్‌కు తరలించారని ఈడీ పేర్కొంది. క్లౌడ్ సీసీటీవీ రెంటల్ సర్వీసెస్ దిగుమతుల పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిష్‌స(ఎసీబీఎం) ద్వారా నగదు బదిలీ చేశారని వివరించింది. చైనా రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. ఇందులో మనీలాండరింగ్ జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో హెచ్ఏఆర్ అసోసియేట్స్ సీఏ రవి కుమార్‌ను గత డిసెంబర్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని ఈడీ వెల్లడించింది.
*రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఠారెత్తిస్తున్న ఎండలకు సోమవారం నలుగురు మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రానికి చెం దిన ఉపాధి హామీ కూలీ కొట్టె రంగయ్య (70), నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం భైరవునిబండ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు ఈదులకంటి లింగయ్య (60)లు కొద్ది రోజులుగా ఎండలో పని చేస్తున్నారు. సోమవారం వడదెబ్బకు గురై చనిపోయారు. అలాగే, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో పోలెపాక బాబూరావు (65), జగిత్యాల జిల్లా కోరుట్లలో నీలి రాములు (69)లు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.
*భర్తనుపిల్లలను చంపుతానని బెదిరించి వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. మండలంలోని ముల్కనూర్ పోలీ్సస్టేషన్లోసీఐ శ్రీనివాస్ సోమవారం ఈ వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో ఆ వివాహిత కిరాణాషాపు నడుపుతోంది. ఆమె భర్త క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు రెండేళ్లుగా ఆమెతో ప్రత్యక్షంగానూఫోన్లోనూ అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు.ఈ విషయమై పలుమార్లు పంచాయితీ పెట్టించగాఇక ముందు అలా మాట్లాడనని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకునేవాడు. ఆ తరువాత అలాగే ప్రవర్తించేవాడు. భర్త ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించి ఆదివారం అర్ధరాత్రి గంటల సమయంలో కరుణాకర్ ఆమె ఇంటికి వెళ్లాడు. అరిస్తే భర్తనుపిల్లలను చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
*అనంతపురం జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి గోడకూలి దాదాపు 150 గొర్రెలు మృతి చెందాయి. రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గొర్రెల యాజమాని పూజారి నాగార్జున గొర్రెల మందను చల్లా బాలకృష్ణ అనే రైతు పొలంలో సాయంత్రం నిలిపాడు. రాత్రి వర్షం కురవడంతో గొర్రెలు పక్కనే ఉన్న షెడ్డు వద్దకు వెళ్లాయి. వర్షానికి తడిసిన గోడ ఒక్కసారిగా గొర్రెల మందపై కూలింది. .
*డిగ్రీ చదువుతున్న నలుగురు విద్యార్థినులు అర్ధరాత్రివేళ పాఠశాల ప్రహరీ గోడ దూకి పరారయ్యారు. చంద్రగిరి డీఎస్పీ నరసప్ప కథనం మేరకు… తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో సంప్రదాయ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు సుమారు 350మంది విద్యార్థినులు ఇక్కడ వసతి పొందుతూ, తిరుపతి, చంద్రగిరిల్లోని పలు విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో విశాఖపట్నం రూరల్ జిల్లా సింహాచలానికి చెందిన రవివిద్యలక్ష్మి వర్షిణి(18), కడప జిల్లా రాజుపాళేనికి చెందిన ప్రణతి(18), విజయవాడ విద్యాధరపురం, కామకోటినగర్‌కు చెందిన స్రవంతి(18), విజయనగరం పట్టణానికి చెందిన అక్కిని శ్రీవల్లి(19) చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న వసతి గృహం ప్రహరీ గోడ దూకి ఈ నలుగురు విద్యార్థినులు పరారయ్యారు. ఈ విషయమై తల్లిదండ్రులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ఇన్చార్జి లక్ష్మి తెలిపారు.
*తెనాలి ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ కట్ అయింది.మాతాశిశు విభాగంలో మధ్యాహ్నం గంటల నుంచి కరెంట్సరఫరా నిలిచిపోయింది.ప్రభుత్వాస్పత్రిలో నిరుపయోగంగా జనరేటర్లు మారాయి. మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. విద్యుత్ లేక బాలింతలుచిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలింతను కొందరు వ్యక్తులు బండరాళ్లతో తలపై మోది చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కొంతదూరం లాక్కెళ్లి పడేశారు. అంతకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు 7 నెలల కిందట బాబు పుట్టాడు. పది రోజుల క్రితం ఆమె కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సోమవారం ఉదయం తన బాబును తోడికోడలుకు అప్పగించి బహిర్భూమికి వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్తకు బంధువులు ఫోన్ చేసి చెప్పారు. అనంతరం బంధువుల ఇళ్లలో వాకబు చేశారు. అక్కడా లేకపోవడంతో ఊరి బయట వెతికారు. తల పూర్తిగా ఛిద్రమై విగత జీవిగా పడి ఉన్న బాధితురాలు కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడికి సమీపంలోని ఓ బావి దగ్గర నుంచి బండరాళ్లు తెచ్చి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
* కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం గ్రామంలో చేపల చెరువులో తేలియాడుతున్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కేసు నమోదు చేసి మహిళా వివరాలను నందివాడ మండల పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు పడి మరణించిందా? లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
*మానవ సంబంధాలు రోజురోజుకీ మాయమైపోతున్నాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ. కామారెడ్డిలోని అయ్యప్పనగర్‌లో రైలు ఢీకొని సంజీవ్(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్తి తగాదాలతో మృతదేహాన్ని సోదరులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మృతదేహంతో మృతుని భార్య, కుమారులు ఇంటి ముందు బైఠాయించారు.
*నిజామాబాద్: జిల్లాలోని కమ్మర్పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో చిన్నారి శరణ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం స్థానికులు శరణ్యను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తలిరంచారు. బైక్‌ను ఢీకొట్టి వాహనం ఆపకుండానే వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి..వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులు: దంపతులు కృష్ణ, రజిత, కూతురు రాగిణిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
*ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర స్కూటీని కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో భారీ కంటైనర్ బీభత్సం సృష్టించింది. స్కూటీఫై వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కంటైనర్ కిందపడి ఆమె శరీరం ముక్కలైంది. పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పటాన్చెరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలు పటాన్చెరు పే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే జ్యోతిగా గుర్తించారు.
*రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎంఎం పహాడీలో ఓ యువకుడు ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. నిన్న రాత్రి భార్యతో రజా అలీ అనే యువకుడు గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రజా అలీ.. అర్థరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంగా వల్ల తల్లి కడుపులోనే పసికందు మృతి. గొడుగుపేట నుండి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళ. మహిళను పరీక్షించి అంతా బాగానే ఉంది రేపు ఉదయం ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు. రాత్రి తల్లి కడుపులో శిశువు చనిపోయింది, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని మహిళా బంధువులకు చెప్పిన వైద్యులు. వైద్యుల మాటలతో కంగుతిన్న మహిళా బంధువులు. సాయంత్రం వరకు హెల్టీగా ఉన్న బేబీకి ఎం జరిగింది? ఎందుకు చనిపోయింది కారణాలు చెప్పాలని డాక్టర్లను నిలదీసిన బాధితులు. డాక్టర్ల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆసుపత్రిలోనే నిరసనకు దిగిన మహిళా కుటుంబ సభ్యులు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి ఉండగా కన్సల్ట్ సంతకం చేయడానికి ముందుకు రాని మహిళా కుటుంబ సభ్యులు. ఎవరు ముందుకు రాకపోవడంతో నిలిచిపోయిన ఆపరేషన్.