నార్త్ కరోలినా రాష్ట్రంలోని ర్యాలీలో 27వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అలనాటి అందాల తార ఎల్.విజయలక్ష్మి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. తెదేపా సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ M V S N రాజు, ఎన్నారై తేదేపా కన్వీనర్ కోమటి జయరాం తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు, ప్రముఖ గాయని ఆకునూరి శారద ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహిస్తున్నారు,