: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా జూన్ 4నుంచి 7వ తేదీ వరకు ఖతర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడి ప్ర వాస తెలుగువారు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు జరిగే విదేశీ పర్యటన చివరి మజిలీలో ఉపరాష్ట్రపతి ఖతర్ వస్తారని విదేశాంగశాఖ తెలిపింది. ఖతర్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖతర్ యువరాజు షేక్ అబ్దుల్లాబిన్ హామద్ అల్తానీతో సమావేశమయ్యే భారత ఉన్నతస్థాయి బృందానికి ఉపరాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు. వ్యాపారవేత్తలు, భారతీయులతో జరిగే వేర్వేరు సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటారు. తొలుత ఉపరాష్ట్రపతి ఆఫ్రికాలోని గబాన్, సెనేగల్లలో పర్యటిస్తారు.