సీఐఐ ఇండియా బిజినెస్ ఫోరమ్ – సౌతాఫ్రికా ఐటీ టాస్క్ టీం చైర్ పర్సన్‌గా గుర్రాల నాగరాజు నియామకం అయ్యారు. సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటిసారి.. ముఖ్యంగా తెలంగాణ వ్యక్తి కి ఈ గౌరవం దక్కింది.ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించిన సీఐఐ ఇండియా బిజినెస్ ఫోరమ్ (దక్షిణాఫ్రికా) కి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను అన్ని రకాలుగా అందరికి ఆమోద యోగ్యంగా నిర్వహిస్తానని చెప్పారు. సౌతాఫ్రికా – ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐఐ ఇండియా బిజినెస్ ఫోరమ్ (దక్షిణాఫ్రికా) కార్పొరేట్ సభ్యుల ప్రత్యేక సమూహం. CII-IBF (SA) ఆసక్తి గల కంపెనీల ప్రతినిధుల బృందాలను కూడా నిర్వహిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలకు, వ్యాపార సహకారం కోసం కొత్త మార్గాలను చూపిస్తుందని గుర్రాల నాగరాజు తెలిపారు.