79750పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటానంటోంది మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ . ఈ విషయాన్ని గతంలోనే ఆమె చెప్పారు. మరోసారి ఈ విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం తెలుగులో ‘18 పేజీస్ ’, ‘కార్తికేయ 2 ’, ‘బటర్‌ఫ్లై’ చిత్రాల్లో బిజీగా ఉన్నారామె. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘మీరు సింగిల్‌గా ఉన్నారా? మింగిల్ కావడానికి రెడీగా ఉన్నారా? అని ప్రశ్నించగా ‘‘నేను సింగిల్.. కాదు. అలాగని రెడీ టూ మింగిల్ కూడా కాదు. ఈ విషయంలో ఏం చెప్పాలో నాకే తెలియడం లేదు. నా రిలేషన్షిప్ స్ట్టేటస్ విషయంలో నాకే క్లారిటీ లేదు. వన్ సైడ్ లవ్ అని మాత్రం చెప్పగలను. అటువైపు ఏమనుకుంటున్నారో ఇంకా తెలియదు. నాకు ప్రేమ వివాహంపై మంచి అభిప్రాయం ఉంది. అలాగని పెద్దలు కుదిర్చిన పెళ్లిపై మంచి అభిప్రాయం లేదని కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని చూస్తే భలే ముచ్చటగా ఉంటుంది. నాక్కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుంది. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ సంగతి తెలుసు’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు.