తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామరావు శతజయంతి వేడుక జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఆదివారం కన్నులపండువగా జరిగింది. తెలుగుదేశం పార్టీ జర్మనీ ఆద్వర్యంలో 2018 నుంచి నాలుగు మినీ మహానాడులు జరుగగా ఆదివారం 5వ మినీ మహానాడును మునుపెన్నడూ చూడని రీతిలో వైభవోపేతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మొదటగా తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులు నందమూరి తారకరాముడికి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నీలిమ కుడితిపూడి గీసిన తారకరాముడి చిత్రపటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది . ఈ క్రమంలో.. తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులు వచ్చే సంవత్సరంలో పార్టీ కోసం తాము చేయబోయే కృషిని తెలియజేస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టారు.
జర్మనీలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉరవకొండ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ పయ్యావుల కేశవ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీ-టీడీపీ విభాగం తెలుగు మహిళ అధ్యక్షులు ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరునగరి వర్చ్యువల్ మీటింగ్ ద్వారా హాజరై తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆ తరువాత.. పార్టీ కోసం ప్రాణం వదిలిన కార్యకర్తలకు, నాయకులకు సభ్యులందరూ సంతాపాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులతో పసుపు ప్రతిజ్ఞ చేపట్టారు.
ఈ కార్యక్రమం మొత్తం ‘జోహార్ అన్న ఎన్టీఆర్!’, ‘జై బాబు..జై జై బాబు!’ అన్న నినాదాలతో హోరెత్తింది.జర్మనీలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు ఈ వేడుకలో యువత పెద్ద సంఖ్యలో హాజరవ్వటం విశేషం. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విదేశీవిద్య పథకం ద్వారా ఉన్నతవిద్యను అభ్యసించి అక్కడే కొలువులు పొందిన విషయాన్ని కొందరు గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం జర్మనీ విభాగం ముఖ్యసభ్యులైన శ్రీకాంత్, పవన్ కుర్రా, శివ, సుమంత్ కొర్రపాటి, అనిల్ మిక్కిలినేని, టిట్టు మద్దిపట్ల, నరేష్ కోనేరు, వంశీకృష్ణ దాసరి, వెంకట్ కాండ్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.