హాలీవుడ్ సంగతేమో కానీ భారతీయ సినిమాలకు ఇంటర్వెల్ అన్నది సర్వసాధారణం సినిమా మధ్యలో కాసేపు ప్రేక్షకులు స్నాక్స్ తింటూ రిలాక్స్ అవడమే కాదు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది. సెకండ్ హాఫ్ ఇంకెలా ఉండబోతుందంటూ బేరీజు వేసుకుంటారు. ఇంటర్వెల్ బాంగ్ అంటూ విశ్రాంతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా తీర్చి దిద్దుకుంటారు. దర్శకులు అందుకే ఇంటర్వెల్ లేకుండా ఓ సినిమాను ఊహించలేం. అయితే ఓ బాలీవుడ్ సినిమా ఇంటర్వెల్ లేకుండానే విడుదలై ఆశ్చర్యపరిచింది. అదే దోబీఘాట్ అమీర్ ఖాన్ నిర్మాణంలో ఆయన భార్య కిరణ్ రావ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2010లో విడుదలైంది. గంటా నలభై నిమిచాల నిడివి ఉన్న ఈ సినిమాలో ఇంటర్వెల్ ను పెట్టలేదు. ఓ ప్రవాహంలా సాగిపోతున్న కధకు ఇంటర్వెల్ తో అడ్డుకట్ట వేయకూడదని ఆ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంటర్వెల్ లేని తోలి భారతీయ చిత్రంగా నిలిచింది దోబీ ఘాట్.
ఆ రికార్డు ఈ చిత్రానిదే
Related tags :