Videos

మన్మథుడు-2 టీజర్ వీడియో

Manmadhudu2 Official Telugu Teaser

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ టీజర్‌ విడుదలైంది. ‘నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది’ అని ప్రముఖ నటి దేవదర్శిని.. నాగ్‌ను ఉద్దేశిస్తూ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇంకా పెళ్లి చేసుకోలేందంటూ నాగ్‌ తల్లి(దేవదర్శిని), బామ్మ (లక్ష్మి) కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ నాగ్‌ మాత్రం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ గడిపేస్తుంటాడు. టీజర్‌ చివర్లో నాగ్‌ స్టైల్‌గా.. ‘ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. నాగార్జున కోడలు సమంత అతిథి పాత్రలో కన్పించనున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌9న ప్రేక్షకుల ముందుకు రానుంది.