తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి వేడుక, మహానాడును అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఎన్నారై తెదేపా కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెలకటూరి లక్ష్మీనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిచా వల్లూరుపల్లి, శ్రీనివాస్ కోటిపల్లి పాటలు పాడి అందరినీ అలరించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని శ్రీనివాస్ దామ, అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని కేశవ్ మాగంటి తీర్మానించారు. వెంకట్ నల్లూరి, శిల్పా బండ్ల తదితరులు ప్రసంగించారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ వేడుకల్లో ‘జోహార్ అన్న ఎన్టీఆర్’, ‘జై బాబు.. జై జై బాబు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేణు కొల్ల, సాయి మనీంద్ర, మధు ఉప్పగండ్ల తెదేపా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి సుమారు 150 మంది కొత్త సభ్యులను ఎన్నారై తెదేపాలో చేర్పించారు. కళ్యాణ్ పెమ్మసాని, శ్రీనివాస్ కుదారవల్లి, కమలాకర్ అనంతనేని కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రావు ద్రోణవల్లి, అరుణ్ కొమ్మినేని, వెంకట్ నెల్లూరి, ప్రకాశ్ కన్యధార, రతన్ కొమ్రనేని, మురళీ నర్ల, నాయుడు ఒట్టిగుంట, గౌతమ్ నల్లూరి, శ్రీనివాస్ కోడె, సురేశ్ తుమ్మల, హరి బండ్ల, గోపి మండ్ల, శ్రీధర్ కొడాలి, వెంకట్ గొర్రెపాటి, సోమశేఖర్ పెమ్మసాని, సాయి నంబూరి, చంద్ర గన్నె తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతమవ్వడానికి కృషి చేసిన దాతలు మనోహర్ నాయుడు వెలకుర్తి, ప్రకాశ్ కన్యధార, బాపురెడ్డి మోతె, శివ జాస్తిలకు నిర్వహకులు ప్రత్యేకంగా ధన్యవాధాలు తెలిపారు.
కాన్సాస్లో ఘనంగా NTR శతజయంతి వేడుక
Related tags :